Viral Video: ‘తిట్టిన ప్రతీ నోరు మూసుకోవాల్సిందే..’ హార్దిక్ ఫోటోతో రోహిత్ ఫ్యాన్ ఏం చేశాడో చూస్తే
సుమారు 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ సారధ్యంలో భారత జట్టు గ్రూప్ స్టేజి నుంచి ఎదురులేని టీంగా.. ఫైనల్‌కు చేరి.. చివరి స్టెప్పులో సఫారీలను చిత్తు చేసి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని అందుకుంది.
సుమారు 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ సారధ్యంలో భారత జట్టు గ్రూప్ స్టేజి నుంచి ఎదురులేని టీంగా.. ఫైనల్‌కు చేరి.. చివరి స్టెప్పులో సఫారీలను చిత్తు చేసి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని అందుకుంది. అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాటర్‌గా రోహిత్ శర్మ.. కీలక సమయంలో విరాట్ కోహ్లీ.. అవకాశం దొరికినప్పుడల్లా సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శివమ్ దూబే.. ఇలా బ్యాటింగ్ విభాగంలో ప్రతీ ఒక్కరూ విజయంలో తమ వంతు పాత్ర పోషిస్తే.. బౌలింగ్‌లో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్‌తో ఆకట్టుకున్నారు.
ఇక వీళ్లందరిని పక్కన పెడితే.. గ్రూప్ స్టేజి నుంచి ఫైనల్ వరకు ప్రతీ ఒక్క మ్యాచ్‌లోనూ టీమిండియా విజయాలకు ప్రధాన పాత్ర పోషించాడు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా. అంతేకాకుండా అత్యంత కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో క్లాసెన్ వికెట్‌తో పాటు.. ఆఖరి ఓవర్‌లో మిల్లర్ వికెట్ తీసి మ్యాచ్ భారత్ వైపు తిప్పాడు హార్దిక్. టోర్నీ అంతటా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు పాండ్యా. దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఈ మ్యాచ్ విన్నర్‌ని పట్టుకుని.. ఐపీఎల్ కోసమని ట్రోల్ చేశామని అని ఫీల్ అవుతున్నారు.
ఐపీఎల్‌లో ముంబై కెప్టెన్సీని హార్దిక్.. రోహిత్ శర్మ నుంచి లాక్కున్నాడని చాలామంది హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ అప్పట్లో హార్దిక్ పాండ్యాను ఏకీపారేశారు. అయితే ఈ ప్రపంచకప్ పెర్ఫార్మన్స్ చూసి హార్దిక్‌పై అనవసరంగా నోరు పారేసుకున్నామని ఫీల్ అవుతున్నారు రోహిత్ అభిమానులు. ఈ క్రమంలోనే తాజాగా ఓ హిట్‌మ్యాన్ ఫ్యాన్.. హార్దిక్‌కు వినూత్న రీతిలో సారీ చెప్పాడు. టీవీలో హార్దిక్ పాండ్యా ఫోటోకు తిలకం దిద్ది.. పూలదండ వేయడంతో పాటు గుంజీలు తీసి.. ‘హార్దిక్ భాయ్.. నన్ను క్షమించు’ అంటూ రోహిత్ శర్మ అభిమాని ఒకరు ఈ విధంగా హార్దిక్ పాండ్యాకు క్షమాపణ చెప్పారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..