MS Dhoni: ఆ మ్యాచ్‌తో కోహ్లీ గెట్ అవుట్.. కానీ ధోనినే.! 11 ఏళ్ల టాప్ సీక్రెట్ బయటపెట్టిన పాక్ ప్లేయర్

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా.. ఇలా ఒకరేమిటి ధోని సారధ్యంలో ఎందరో ఆణిముత్యాలు టీమిండియాలో పుట్టుకొచ్చారు. ఫాం ఉన్నా.. లేకపోయినా.. ఎప్పుడూ కూడా తన సహచర ఆటగాళ్ళకు మద్దతుగా నిలుస్తూ వస్తాడు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని. ఈ మాట మన దేశ మాజీ క్రికెటర్లు కాదు అంటోంది.

MS Dhoni: ఆ మ్యాచ్‌తో కోహ్లీ గెట్ అవుట్.. కానీ ధోనినే.! 11 ఏళ్ల టాప్ సీక్రెట్ బయటపెట్టిన పాక్ ప్లేయర్
Dhoni & Kohli
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 03, 2024 | 6:27 PM

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా.. ఇలా ఒకరేమిటి ధోని సారధ్యంలో ఎందరో ఆణిముత్యాలు టీమిండియాలో పుట్టుకొచ్చారు. ఫాం ఉన్నా.. లేకపోయినా.. ఎప్పుడూ కూడా తన సహచర ఆటగాళ్ళకు మద్దతుగా నిలుస్తూ వస్తాడు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని. ఈ మాట మన దేశ మాజీ క్రికెటర్లు కాదు అంటోంది.. పాకిస్తాన్ మాజీలు సైతం ఇదే మాట అంటున్నారు. పాక్ మాజీ క్రికెటర్ ఉమర్ అక్మల్ సాక్షిగా నిలిచిన ఓ ఘటన ఇది. విరాట్ కోహ్లీ విషయంలో ధోని ఎంత గట్టిగా ఉంటాడో చెప్పే సంఘటన ఇదని ఉమర్ అక్మల్ తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో వెల్లడించాడు.

2012-13లో పాకిస్తాన్ 3 వన్డేల ద్వైపాక్షిక సిరీస్ నిమిత్తం భారత్‌కు వచ్చింది. అప్పుడు విరాట్ కోహ్లీ పెద్దగా ఫాంలో లేడు. ఈ సిరీస్ లాస్ట్ మ్యాచ్ నుంచి అతడ్ని తప్పించాలని భారత జట్టు టీం మేనేజర్ ధోనికి సూచన ఇవ్వగా.. అందుకు మిస్టర్ కూల్ షాకింగ్ రిప్లయ్ ఇచ్చాడని అక్మల్ చెప్పాడు.

‘2012-13లో ద్వైపాక్షిక సిరీస్ నిమిత్తం మేము భారత్ పర్యటనకు వెళ్ళాం. ఓ రోజు ధోని, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, షోయాబ్ మాలిక్ కలిసి డిన్నర్ చేస్తున్నాం. అదే సమయంలో టీమిండియా మేనేజర్ ధోని దగ్గరకు వచ్చి.. విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేడని.. చివరి వన్డే నుంచి తప్పించాలని సలహా ఇచ్చాడు. వెంటనే ధోని స్పందిస్తూ ‘సరే.! నేను కూడా ఇంటికి వెళ్లి ఆరు నెలలు అయింది. కెప్టెన్సీ సురేష్ రైనా చూసుకుంటాడు. నాకు, కోహ్లీకి కలిపి టికెట్లు బుక్ చేయండి’ అని అన్నాడు. దానితో మేనేజర్‌ మరో మాట మాట్లాడకుండా.. ‘మీరు అనుకున్నట్టుగానే విరాట్‌ను ఆడించండి’ అని చెప్పి వెళ్లిపోయాడు. ఇక ఆ తర్వాత కాసేపటికి ఈ విషయంపై నేను కూడా ధోనిని అడగ్గా.. ‘విరాట్.. మా టీంలో అత్యుత్తమ బ్యాటర్. రెండు లేదా మూడు మ్యాచ్‌లు విఫలమైనంత మాత్రాన అతడ్ని ఎందుకని పక్కన పెడతాం.?’ అని చెప్పాడు. ధోని సమాధానం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. తన కెప్టెన్ నుంచి ఓ ఆటగాడికి ఇంతటి సహకారం అందితే.. అంతకన్నా ఏం కావాలి’ అని ఉమర్ అక్మల్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో విరాట్ కోహ్లీ 76 పరుగులతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్