AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya: హార్దిక్ పాండ్యా ఆస్తిలో 70 శాతం వాటా భార్యకు ట్రాన్స్‌ఫర్.. విడాకులకు సిద్ధం?

Hardik Pandya-Natasa Stankovic: ఈ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించాడు. 14 మ్యాచ్‌ల్లో ముంబయి జట్టు కెప్టెన్‌గా కనిపించిన పాండ్యా.. 4 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించాడు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి ఐపీఎల్ ప్రచారాన్ని కూడా ముగించాడు. ఈ ప్రచారం ముగిసిన వెంటనే హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం చర్చనీయాంశంగా మారింది.

Hardik Pandya: హార్దిక్ పాండ్యా ఆస్తిలో 70 శాతం వాటా భార్యకు ట్రాన్స్‌ఫర్.. విడాకులకు సిద్ధం?
Hardik Pandya
Venkata Chari
|

Updated on: May 25, 2024 | 3:17 PM

Share

Hardik Pandya-Natasa Stankovic: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఆయన భార్య నటాసా స్టాంకోవిచ్ విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తకు బలం చేకూర్చేలా ఇప్పుడు వీరిద్దరి మధ్య మనస్పర్థలు బయటపడ్డాయంట. హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ 2020 లో వివాహం చేసుకున్నారు. నటాషా IPL ప్రతి సీజన్‌లో కనిపించింది. అయితే ఈ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్‌గా పాండ్యా అరంగేట్రం చేసినప్పటి నుంచి నటాషా మాత్రం కనిపించలేదు. అలాగే, ఆమె ఏ మ్యాచ్ చూసేందుకు రాలేదు.

అలాగే మార్చి 4 నటాషా పుట్టినరోజు. ఆ రోజు, హార్దిక్ పాండ్యా తన భార్యకు సోషల్ మీడియాలో ఒక్క పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా పోస్ట్ చేయలేదు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు మొదలయ్యాయి. ఇవి రోజురోజుకూ మరితంగా వ్యాపించాయి. ఈ క్రమంలో వీరిద్దరూ విడాకాలు తీసుకోబోతున్నట్లు పుకార్లు మొదలయ్యాయి.

ఈ పుకార్లకు బలం చూకూర్చుతూ.. నటాషా స్టాంకోవిచ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పాండ్యా అనే ఇంటిపేరును తొలగించింది. అలాగే ఇటీవలి కాలంలో హార్దిక్ పాండ్యాతో ఒక్క ఫొటో కూడా షేర్ చేయలేదు. ఈ కారణాలన్నింటి వల్లే వీరిద్దరూ ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

అహ్మదాబాద్ మిర్రర్‌లోని ఒక నివేదిక ప్రకారం, విడాకుల విషయంలో హార్దిక్ పాండ్యా తన ఆస్తిలో 70 శాతం నటాషాకి ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే పాండ్యా భార్య సెర్బియా దేశానికి చెందినది. అందువల్ల ఆమె సెర్బియన్ దినార్లలో భరణం పొందే అవకాశం ఉంది. ఈ కారణాలన్నింటి వల్లే పాండ్యా తన తదుపరి కదలికపై ఎక్కడా మాట్లాడడం లేదని సమాచారం.

నేచురల్ పెయిర్‌గా కనిపించిన హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ మధ్య అంతా బాగాలేదని తేలింది. ఈ జంట కలిసి ఈ వార్తలకు చెక్ పెడతారని అభిమానులు ఆశపడుతున్నారు. మరి వీరద్దరు ఎలాంటి నిర్ణయం చెబుతారో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు