AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీపై కెవిన్ పీటర్సన్ ప్రశంసలు.. ఏమన్నాడంటే..?

India Transformation: మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) భారత్‌లో చోటుచేసుకున్న మార్పులపై ప్రశంసలు కురిపించాడు. 2003లో తొలిసారి భారత్‌కు వచ్చినప్పటి పరిస్థితులతో పోలిస్తే దేశంలో ఆత్మవిశ్వాసం, క్రీడలు, మౌలిక వసతులు, టెక్నాలజీ, వన్యప్రాణుల సంరక్షణ రంగాల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయని తన అభిప్రాయ వ్యాసంలో పేర్కొన్నాడు.

ప్రధాని మోదీపై కెవిన్ పీటర్సన్ ప్రశంసలు.. ఏమన్నాడంటే..?
Kevin Pietersen On Pm Modi
Venkata Chari
|

Updated on: Oct 26, 2026 | 5:25 PM

Share

India Transformation: మాజీ ఇంగ్లండ్ క్రికెట్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ భారత్‌పై తన అనుబంధాన్ని మరోసారి చాటుకున్నాడు. ‘An aspiring, achieving, & assertive new India’ పేరుతో హిందుస్తాన్ టైమ్స్‌లో రాసిన అభిప్రాయ వ్యాసంలో భారత్ గత రెండు దశాబ్దాల్లో సాధించిన మార్పులపై తన పరిశీలనలను వెల్లడించాడు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నాయకత్వం దేశంలో మారుతున్న దృక్పథానికి తోడ్పడిందని పీటర్సన్ తన వ్యాసంలో పేర్కొన్నాడు.

పీటర్సన్ 2003లో తొలిసారి భారత్‌కు వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో ప్రజల ఆత్మవిశ్వాసం స్పష్టంగా పెరిగిందని అతడు అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా యువత ప్రపంచ స్థాయిలో పోటీ పడగలమనే నమ్మకంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నాడు.

భారత క్రికెట్‌లో భారీ మార్పు..

పీటర్సన్ ప్రత్యేకంగా భారత క్రికెట్ గురించి ప్రస్తావించాడు. గతంలో కొంతమంది అద్భుతమైన సూపర్‌స్టార్లపై భారత క్రికెట్ విజయాలు ఎక్కువగా ఆధారపడేవని గుర్తు చేశాడు. ఇప్పుడు భారత జట్టులో ప్రతిభకు కొదవ లేదని, బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లు కూడా ప్రపంచంలోని అత్యుత్తమ జట్లను ఓడించే స్థాయిలో ఉన్నారని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఫిట్‌నెస్, ప్రిపరేషన్, ప్రొఫెషనలిజంలోనూ గణనీయమైన మార్పులు వచ్చాయని పేర్కొన్నాడు.

ఎక్కువమంది చదివినది: IND vs NZ: కివీస్‌తో వన్డే సిరీస్.. బుల్లెట్ షాట్లతో కోహ్లీ లోడింగ్.. రోకో జోడీ బయల్దేరేది ఎప్పుడంటే?

మహిళల క్రికెట్ ఎదుగుదలపైనా పీటర్సన్ ప్రత్యేకంగా స్పందించాడు. భారత మహిళల క్రికెట్ అభివృద్ధి దేశానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్‌కు ప్రయోజనం కలిగిస్తోందని పేర్కొన్నాడు. అథ్లెటిక్స్, షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, హాకీ, టెన్నిస్ వంటి క్రీడల్లోనూ భారత క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని చెప్పాడు.

టెక్నాలజీ, మౌలిక వసతులపై ప్రశంసలు..

భారత్‌లోని విమానాశ్రయాలు, రోడ్లు, మెట్రో వ్యవస్థలు, హోటళ్ల ప్రమాణాల్లో వచ్చిన మార్పులను కూడా పీటర్సన్ ప్రస్తావించాడు. బ్రిటన్‌లో తన స్నేహితులతో భారత్ గురించి జరిగే చర్చలు కూడా మారిపోయాయని చెప్పాడు. గతంలో వాతావరణం, రద్దీ, ఆహారం గురించి అడిగేవారని.. ఇప్పుడు భారత స్టార్టప్‌లు, డిజిటల్ చెల్లింపులు, అంతరిక్ష కార్యక్రమాలు వంటి అంశాలపై మాట్లాడుతున్నారని పేర్కొన్నాడు.

గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి భారీ నిర్మాణాలను ప్రస్తావిస్తూ భారత్ పెద్ద లక్ష్యాలతో ముందుకు సాగుతోందని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు.

వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక ప్రస్తావన..

వన్యప్రాణుల సంరక్షణపై తనకు ప్రత్యేక ఆసక్తి ఉందని చెప్పిన పీటర్సన్.. కజిరంగా జాతీయ పార్క్‌లో ఖడ్గమృగాల సంరక్షణను చూశానని తెలిపాడు. చీతాల పునరావాస కార్యక్రమం, గుజరాత్ ఆసియా సింహాల సంరక్షణపైనా ప్రశంసలు వ్యక్తం చేశాడు.

ఎక్కువమంది చదివినది: Tilak Varma: టీ20ల్లో కోహ్లీ వారసుడు ఇతనే.. ఛేజింగ్‌‌ అంటే చిర్రెత్తిపోతున్నాడుగా..!

ప్రధాని మోదీతో జరిగిన తన సమావేశంలో చీతాల విడుదల, వన్యప్రాణుల సంరక్షణపై చర్చించిన విషయాన్ని కూడా పీటర్సన్ గుర్తు చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏర్పాటు విషయంలో భారత్ పోషిస్తున్న పాత్రను కూడా ప్రస్తావించాడు.

పీటర్సన్ వ్యాసాన్ని పంచుకున్న ప్రధాని కార్యాలయం..

పీటర్సన్ రాసిన వ్యాసాన్ని ప్రధాని కార్యాలయం కూడా అక్టోబర్ 26న అధికారికంగా పంచుకుంది. క్రీడలు, టెక్నాలజీ, మౌలిక వసతులు, వన్యప్రాణుల సంరక్షణ రంగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతిని పీటర్సన్ తన వ్యాసంలో ప్రస్తావించారని పీఎంఓ పేర్కొంది.

2003లో భారత్‌కు వచ్చినప్పటి నుంచి ప్రతి పర్యటనతో దేశంపై తన అభిమానం మరింత పెరిగిందని పీటర్సన్ చెప్పాడు. భారత్‌లో తనకు అన్నింటికంటే నచ్చేది అక్కడి ప్రజలేనని పేర్కొంటూ తన వ్యాసాన్ని ముగించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us