విహారి సెంచరీ.. బుమ్రా హ్యాట్రిక్.. 257 పరుగుల తేడాతో ప్రత్యర్థిని ఓడించిన భారత్.. ఏ టీంపైనో తెలుసా?

Venkata Chari

Venkata Chari |

Updated on: Sep 02, 2021 | 9:47 PM

ఈ విజయంతో విరాట్ కోహ్లీ భారతదేశంలో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్ అయ్యాడు. అతని నాయకత్వంలో భారత్ 28 వ సారి టెస్ట్ మ్యాచ్ గెలిచింది.

విహారి సెంచరీ.. బుమ్రా హ్యాట్రిక్.. 257 పరుగుల తేడాతో ప్రత్యర్థిని ఓడించిన భారత్.. ఏ టీంపైనో తెలుసా?
Jasprit Bumrah Hat Trick

Follow us on

వెస్టిండీస్‌లో భారత క్రికెట్ జట్టు పేలవమైన రికార్డును కలిగి ఉంది. విండీస్ ఫాస్ట్ బౌలర్ల కారణంగా కరేబియన్ గడ్డపై టీమిండియా గెలవలేకపోయింది. సునీల్ గవాస్కర్ వంటి బ్యాట్స్‌మన్ వెస్టిండీస్‌పై చాలా విజయాలు సాధించినప్పటికీ, అక్కడ జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ, ఆధిపత్యం సాధించలేకపోయాడు. అయితే వెస్టిండీస్ జట్టు ఎప్పుడు బలహీనపడిందో, అప్పుడు భారత క్రికెట్ మరింత బలంగా తయారైంది. దీని ఫలితంగా, ఇటీవలి సంవత్సరాలలో, విండీస్ జట్టుపై భారత్ వరుసగా టెస్ట్ సిరీస్‌లను గెలుచుకుంటూ వస్తోంది. 2019 లో భారత్ చివరిసారిగా వెస్టిండీస్‌లో పర్యటించింది. ఆ సమయంలో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో గెలిచుకుంది. ఈ సిరీస్ చివరి మ్యాచ్‌లో, హనుమ విహారి, జస్ప్రీత్ బుమ్రా భారత విజయానికి కారణమయ్యారు. విహారి సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించగా, బుమ్రా హ్యాట్రిక్‌తో సహా ఏడు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో భారత్ 257 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.

కింగ్‌స్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 416 పరుగులు చేసింది. హనుమ విహారి సెంచరీ ( 111 పరుగులు) సాధించాడు. విరాట్ కోహ్లీ 76 పరుగులు చేయగా, మయాంక్ అగర్వాల్ 55, ఇషాంత్ శర్మ 57 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల స్వల్ప స్కోరుకే చేతులెత్తేసింది. జస్ప్రీత్ బుమ్రా విధ్వంసం కారణంగా విండీస్ టీం అత్యల్ప స్కోర్‌‌కే ఆలౌట్ అయింది. డారెన్ బ్రావో, షమ్రా బ్రూక్స్, రోస్టన్ చేజ్‌లను వరుసగా ఔట్ చేసిన బుమ్రా.. టెస్ట్ క్రికెట్‌లో మొదటి హ్యాట్రిక్ సాధించాడు. టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా కంటే ముందు, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్‌లు హ్యాట్రిక్ సాధించారు. బుమ్రా హ్యాట్రిక్ ఆధారంగా వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 27 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన టీమిండియాకు షాక్ తగిలింది. 57 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే, అజింక్య రహానే (64), హనుమ విహారి (53) అజేయ అర్ధ సెంచరీలతో, భారత్ 4 వికెట్ల నష్టానికి 168 పరుగులు సాధించింది. వెస్టిండీస్ విజయానికి 468 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. కానీ, విండీస్ జట్టు 210 పరుగులకే కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు సఫలమయ్యారు. మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు తీసి విండీస్ బ్యాట్స్‌మెన్లను కష్టాల్లోకి నెట్టారు.

ఈ మ్యాచ్‌లో భారత్ 257 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతోనే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతా తెరిచింది. ఈ విజయంతో విరాట్ కోహ్లీ భారతదేశంలో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా ఎదిగాడు. కోహ్లీ నాయకత్వంలో భారతదేశం 28 టెస్టులను గెలిచింది.

Also Read: Viral Video: పోలా.. అదిరిపోలా.. మనోడి అద్భుతమైన క్యాచ్.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

Virat Kohli – Rohit Sharma: కోహ్లీ – రోహిత్ మధ్య విభేదాలున్నాయా..? ఎట్టకేలకు మౌనం వీడిన రవిశాస్త్రి

IND vs ENG 4th Test Day 1 Live: 191 పరుగులకు టీమిండియా ఆలౌట్.. బౌండరీలతో ఆకట్టుకున్న శార్దుల్ ఠాకూర్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu