Team India: భారత శిబిరంలోకి అడుగుపెట్టిన 6 అడుగుల ఫాస్ట్ బౌలర్.. గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..
India vs Bangladesh: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. ఇందుకోసం ఇరు జట్లను ప్రకటించారు. టీమిండియాలో చాలా మంది దిగ్గజ ఆటగాళ్లు ఎంపికయ్యారు. అదే సమయంలో, బంగ్లాదేశ్ చాలా మంది అద్భుతమైన ఆటగాళ్లను కూడా చేర్చుకుంది. బంగ్లాదేశ్‌లో ఎత్తైన ఫాస్ట్ బౌలర్ నహిద్ రాణా ఉన్నాడు. ఈ కారణంగా అతడిని ఎదుర్కోవడానికి టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రత్యేక ప్లాన్ వేసి.. టీమ్ ఇండియా క్యాంప్‌లోని ఎక్కువ ఎత్తుగల ఫాస్ట్ బౌలర్‌ను పిలిచారు.

ఇక నహిద్ రానా గురించి మాట్లాడితే, పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అతని ఆటతీరు బాగానే ఉంది. రెండో టెస్టు మ్యాచ్‌లో నహిద్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పాక్ బ్యాట్స్‌మెన్‌ను ఊరుకోనివ్వలేదు. ఓవరాల్‌గా నహిద్ రాణా 2 మ్యాచ్ ల్లో 6 వికెట్లు తీశాడు. ఈ కారణంగానే నహిద్ రానా గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. నహిద్ రానా ప్రత్యేకత ఏమిటంటే అతను చాలా పొడవుగా ఉన్నాడు. అందుకే, అతను తన బౌలింగ్ నుంచి మంచి బౌన్స్ పొందాడు.
గుర్నూర్ బ్రార్ కూడా IPLలో భాగం..
Lanky Punjab pacer Gurnoor Brar in India nets for Nahid Rana simulation https://t.co/MyLCDDguYa#cricketdaily
— Sivakumar V (@veeyeskay) September 14, 2024
టెస్టు సిరీస్‌లో నహిద్ రానా టీమిండియాకు పెద్ద సవాల్‌గా మారవచ్చు. ఇందుకోసం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించాడు. నహీద్ రాణా పొడవాటి ఫాస్ట్ బౌలర్‌ను టీమిండియా క్యాంపునకు ఆహ్వానించాడు. తద్వారా భారత బ్యాట్స్‌మెన్ తగిన ప్రాక్టీస్ పొందవచ్చు. పంజాబ్‌కు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ పేరు గుర్నూర్ బ్రార్. అతను ఇప్పటివరకు మొత్తం ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో కూడా భాగమయ్యాడు. 6 అడుగుల 4.5 అంగుళాల పొడవున్న ఫాస్ట్ బౌలర్ కావడం గుర్నూర్ ప్రత్యేకత. భారత కొత్త బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా అతనితో మాట్లాడటం కనిపించింది.
సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ చెన్నైలో, రెండో మ్యాచ్ కాన్పూర్‌లో జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..