GT IPL 2023 Auction: డిఫెండింగ్ ఛాంపియన్స్.. మరో ట్రోఫీకి గురి.. హార్దిక్‌కి నో వర్రీస్, ఓన్లీ బ్యాకపే..
Gujarat Titans IPL 2023 Auction: ఇదే మొదటి సీజన్.. తొలిసారిగా సారధ్య బాధ్యతలు.. కొత్త కోచ్.. అనుభవం ఉన్న ఆటగాళ్లు ఒకవైపు, యంగ్ ప్లేయర్స్ మరోవైపు.. సీన్ కట్ చెస్తే..
Gujarat Titans IPL 2023 Auction: ఇదే మొదటి సీజన్.. తొలిసారిగా సారధ్య బాధ్యతలు.. కొత్త కోచ్.. అనుభవం ఉన్న ఆటగాళ్లు ఒకవైపు, యంగ్ ప్లేయర్స్ మరోవైపు.. సీన్ కట్ చెస్తే.. ఐపీఎల్ ట్రోఫీ సొంతం. ఇదే గుజరాత్ టైటాన్స్ జర్నీ. ఐపీఎల్ 15వ ఎడిషన్‌లో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. మినీ వేలానికి ముందుగా గుజరాత్ ఫ్రాంచైజీ పలువురు ఆటగాళ్లను వదులుకుంది. నో వర్రీస్, ఓన్లీ బ్యాకప్ కోసం మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది. ఓవర్సీస్ ఆప్షన్స్ లక్ష్యంగా ఆక్షన్‌లో వెళ్తోంది.
గుజరాత్ రిటైన్ ప్లేయర్స్ బ్రేక్‌డౌన్ ఇలా..
-
టాప్ ఆర్డర్ బ్యాటర్లు: శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్
-
ఫినిషర్స్: డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్
-
ఆల్‌రౌండర్లు: హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్
-
స్పిన్నర్లు: రషీద్ ఖాన్, సాయి కిషోర్, నూర్ అహ్మద్, జయంత్ యాదవ్
-
*రిలీజ్ ప్లేయర్స్*: రహ్మనుల్లా గుర్బాజ్, లూకీ ఫెర్గుసన్, డొమినిక్ డ్రేక్స్, గుర్‌క్రీట్ సింగ్, జాసన్ రాయ్, వరుణ్ ఆరోన్
-
*మిగిలిన మొత్తం*: రూ 19.25 కోట్లు, *ఓవర్సీస్ స్లాట్స్* – 3, *మొత్తం స్లాట్స్* – 7
ప్రధాన సమస్యలు ఇవే..
– జాసన్ రాయ్ రిలీజ్ చేయడం, రహ్మానుల్లా గుర్బజ్‌ను మరో టీంకు ట్రేడ్ చేయడంతో టైటాన్స్‌కు ఓవర్సీస్ బ్యాకప్ ఓపెనింగ్ ఆప్షన్ చాలా ముఖ్యం.
– ఈ సీజన్‌లో గుజరాత్‌ను వన్‌డౌన్ స్లాట్ బాగా ఇబ్బంది పెట్టింది. ఎంతోమంది ఆటగాళ్లను ప్రయత్నించినప్పటికీ ఎవ్వరూ నిలదొక్కుకోలేకపోయారు. ఆ స్పాట్‌లో సాయి సుదర్శన్ అద్భుతంగా రాణిస్తున్నా.. టీం ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తుంది కాబట్టి మిడిల్ ఆర్డర్ బ్యాకప్ కూడా ఇంపార్టెంట్.
– డెత్ బౌలింగ్ ఆప్షన్స్‌లో టైటాన్స్‌కు ఉన్నది అల్జారి జోసెఫ్ ఒక్కడే. దీంతో మరో పేస్ బౌలర్ లేదా, అనుభవమైన సీనియర్ బౌలింగ్ ఆప్షన్‌కు గుజరాత్ చూడవచ్చు.
టార్గెట్ ప్లేయర్స్: మయాంక్ అగర్వాల్, విరాట్ సింగ్, ట్రావిస్ హెడ్, జోష్ ఫిలిప్, రిలీ రోసౌవ్, జో రూట్, సామ్ కర్రన్, టైమల్ మిల్స్, జై రిచర్డ్‌సన్, రీస్ టోప్లీ, జాషువా లిటిల్, షెల్డన్ కాట్రెల్