LSG IPL 2023 Auction: కప్పు కోసం రాహుల్ ఆత్రం.. ఆ 4గురు ప్లేయర్స్ దొరికితే ఇక పండగే.. లక్నో టార్గెట్ ఇదే

Lucknow Super Giants IPL 2023 Auction: లక్నో సూపర్ జెయింట్స్.. పేరుకు మాత్రమే ఇది కొత్త ఫ్రాంచైజీ. కానీ మొదటి సీజన్‌లో దాదాపు ట్రోఫీ కొట్టినంత పని చేసింది.

LSG IPL 2023 Auction: కప్పు కోసం రాహుల్ ఆత్రం.. ఆ 4గురు ప్లేయర్స్ దొరికితే ఇక పండగే.. లక్నో టార్గెట్ ఇదే
Lucknow Super Giants
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 22, 2022 | 7:41 PM

Lucknow Super Giants IPL 2023 Auction: లక్నో సూపర్ జెయింట్స్.. పేరుకు మాత్రమే ఇది కొత్త ఫ్రాంచైజీ. కానీ మొదటి సీజన్‌లో దాదాపు ట్రోఫీ కొట్టినంత పని చేసింది. మరో కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌తో పోటీపడి ఎలిమినేటర్ వరకు వెళ్లింది. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమిపాలైంది. లక్నో జట్టులో ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు ఎక్కువగా ఉన్నారు. అయితే మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్ళగలిగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్, ఫినిషర్లు లేరు. అలాగే బౌలింగ్ యూనిట్‌లో మెరుపులు మెరిపించేవారి ఒక్కరు కూడా ఉండకపోవడం గమనార్హం. అందుకే మినీ వేలంలో టాప్ రేటెడ్ ప్లేయర్స్ లక్ష్యంగా లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

లక్నో రిటైన్ ప్లేయర్స్ బ్రేక్‌డౌన్ ఇలా..

  • టాప్ ఆర్డర్ బ్యాటర్లు: కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, మనన్ వోహ్రా, కైల్ మేయర్స్

  •  ఫినిషర్స్: మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బడోని

  • ఆల్‌రౌండర్లు: దీపక్ హుడా, కరణ్ శర్మ, కృనాల్ పాండ్యా

  • స్పిన్నర్లు: కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్

  • ఫాస్ట్ బౌలర్లు: అవేశ్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, మార్క్ వుడ్

  • *రిలీజ్ ప్లేయర్స్*: టై, అంకిత్ రాజ్‌పూత్, చమీరా, ఎవిన్ లెవిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే, నదీమ్

  • *మిగిలిన మొత్తం*: రూ 23.35 కోట్లు, *ఓవర్సీస్ స్లాట్స్* – 4, *మొత్తం స్లాట్స్* – 10

ప్రధాన సమస్యలివే:

– ఎవిన్ లెవిస్, మనీష్ పాండే ఎగ్జిట్‌తో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎక్కువయ్యారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు తక్కువయ్యారు.

– జాసన్ హోల్డర్‌ను రిలీజ్ చేయడం.. మార్క్ వుడ్, ఆవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్‌కు డెప్త్ వరకు బ్యాటింగ్ చేసే సామర్ధ్యం లేకపోవడంతో.. సామ్ కర్రన్ వారికి ఆల్‌రౌండర్‌గా సరైన ఆప్షన్ అవుతాడు.

– మార్క్ వుడ్‌ను గాయాలు వెంటాడుతుండటంతో మరో బ్యాకప్ పేస్ ఆప్షన్ కోసం కూడా లక్నో సూపర్ జెయింట్స్ వెతుకుతారు.

టార్గెట్ ప్లేయర్స్: హ్యారీ బ్రూక్, కామెరాన్ గ్రీన్, బెన్ స్టోక్స్, సామ్ కర్రాన్, ప్రియమ్ గార్గ్, బాబా అపరాజిత్, రిలే మెరెడిత్, జాషువా లిటిల్, ఆడమ్ మిల్నే, ల్యూక్ వుడ్, బ్లెస్సింగ్ ముజారబానీ, నవీన్ ఉల్ హక్, సికందర్ రాజా

ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ