IPL 2023: విధ్వంసకర ఓపెనర్లే ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యం.. పంత్ కెప్టెన్సీ కూడా ఊస్టేనా.? మరి నెక్స్ట్ ఎవరు..
Delhi Capitals IPL 2023 Auction: ఢిల్లీ క్యాపిటల్స్.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఈ జట్టు గత రెండు సీజన్ల నుంచి అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది.
Delhi Capitals IPL 2023 Auction: ఢిల్లీ క్యాపిటల్స్.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఈ జట్టు గత రెండు సీజన్ల నుంచి అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఈ సీజన్ టోర్నమెంట్‌లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఏడింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఈ జట్టుకు రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఢిల్లీ ప్రధాన సమస్య ఓపెనర్లు.. ప్రస్తుతం ఉన్న పృథ్వీ షా, వార్నర్ సరిగ్గా ఆడకపోతే.. ప్రతీసారి జట్టు విఫలమవుతోంది. ఇందులో భాగంగా నెక్స్ట్ ఐపీఎల్‌లో కప్పు కొట్టడమే లక్ష్యంగా పలువురు ప్లేయర్స్‌ను మినీ వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా మినీ వేలంలో ఈ జట్టు విధ్వంసకర ఓపెనర్లే లక్ష్యంగా పెట్టుకుంది. అటు పంత్ కూడా పేలవ ఫామ్ కొనసాగిస్తుండటంతో కెప్టెన్సీ నుంచి తొలగిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ ఆటగాళ్ల బ్రేక్ డౌన్ ఇలా..
-
టాప్ ఆర్డర్ బ్యాటర్లు: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, యశ్ ధుల్
-
ఫినిషర్స్: రిషబ్ పంత్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, రిపాల్ పటేల్
-
ఆల్‌రౌండర్లు: అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, అమన్ ఖాన్
-
స్పిన్నర్లు: కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్
-
ఫాస్ట్ బౌలర్లు: చేతన్ సకారియా, అన్రిచ్ నోర్తెజ్, లుంగి ఎనిగిడి, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్, కమలేష్ నాగర్కోటి
-
*మిగిలిన మొత్తం*: రూ 19.45 కోట్లు, *ఓవర్సీస్ స్లాట్స్* – 2, *మొత్తం స్లాట్స్* – 5
-
*రిలీజ్ ప్లేయర్స్*: శార్దూల్ ఠాకూర్, టిమ్ సిఫెర్ట్, అశ్విన్ హెబ్బర్, శ్రీకర్ భరత్, మన్‌దీప్ సింగ్
ప్రధాన సమస్యలివే:
– టీ20ల్లో అనుభవం ఉన్న బ్యాకప్ ఓపెనర్ మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ముందున్న లక్ష్యం. ఈ సీజన్‌లో వార్నర్ లేదా పృథ్వీ షా విఫలమైన ప్రతీసారి ఢిల్లీ టీం ఇబ్బందుల్లో పడింది.
– ఈ సీజన్‌లో గాయం బారిన పడిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ తిరిగి ఫామ్‌లోకి వచ్చేవరకు క్యాపిటల్స్‌కు సరైన వన్‌డౌన్ బ్యాటర్ లేడు. అందుకే అండర్-19 ప్లేయర్ యష్ ధుల్‌పై ఢిల్లీ ఫోకస్ పెట్టింది.
– పంత్ స్థానంలో ఢిల్లీకి బ్యాకప్ వికెట్ కీపర్ మాత్రమే కాదు.. చివరి వరకు లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగే అనుభవం ఉన్న బ్యాటర్ అవసరం.
టార్గెట్ ప్లేయర్స్: జాసన్ రాయ్, ఫిల్ సాల్ట్, రిలీ రోసౌవ్, కేన్ విలియమ్సన్, లిటన్ దాస్, విష్ణు వినోద్, జాసన్ హోల్డర్, దసున్ షనక