GT IPL 2023 Auction: కేన్‌మామ చేరికతో మరింత బలంగా హార్దిక్ టీం.. గుజరాత్ పూర్తి జట్టు ఇదే
Gujarat Titans Auction Players List :

Gujarat Titans Auction Players List : టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈనేపథ్యంలో రాబోయే సీజన్‌లో డిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది హార్దిక్ సేన. టైటిల్‌ను నిలబెట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా ఐపీఎల్ వేలం 2023లో స్టార్ ఆటగాళ్లనే ఎంపిక చేసుకుంది. మొదట ఎస్‌ఆర్‌హెచ్ మాజీ కెప్టెన్, న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్స బేస్ ధర రూ.2 కోట్లకే చేజిక్కించుకుంది. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు విలియమ్సన్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ ఫ్రాంచైజీ రిలీజ్ చేసింది. అతనితో పాటు వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఒడియన్ స్మిత్‌ను బేస్ ధర రూ. 50 లక్షలకే కొనుగోలు చేసింది గుజరాత్. ఇక బ్యాకప్ వికెట్ కీపర్ ఆలోచనతో KS భరత్‌ను కూడా జట్టులోకి తీసుకుంది. అదే సమయంలో యువ ఆటగాడు శివమ్ మావి కోసం ఏకంగా రూ. 6 కోట్ల వెచ్చించింది. తద్వారా రాబోయే సీజన్‌లో తమ జట్టుకు మరింత సమతుల్యం తెచ్చే ప్రయత్నం చేసింది. కాగా ఐపీఎల్ వేలానికి ముందే గుజరాత్ టైటాన్స్ బ్యాలెన్స్ చేసింది. గుజరాత్ చాలా మంది ఆటగాళ్లను రిటైన్ చేసి కేవలం 6 మంది ఆటగాళ్లను మాత్రమే విడుదల చేసింది.
మినీ వేలంలో గుజరాత్ దక్కించుకున్న ఆటగాళ్లు..
- కేన్ విలియమ్సన్ (బ్యాటర్) – రూ. 2 కోట్లు
- ఓడియన్ స్మిత్ (ఆల్ రౌండర్) – రూ. 50 లక్షలు
- కేఎస్ భరత్ (వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్) – రూ. 1.20 కోట్లు
- శివమ్ మావి (బౌలర్) – రూ. 6 కోట్లు
GT రిటైన్ చేసిన ఆటగాళ్లు
హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, సాయి కిషోర్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, యష్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, మహ్మద్ షమీ, మహ్మద్ షమీ మరియు నూర్ అహ్మద్.




GT విడుదల చేసిన ప్లేయర్స్
డొమినిక్ డ్రేక్స్, గురుకీరత్ సింగ్, జాసన్ రాయ్, రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ ఆరోన్
GT పూర్తి స్క్వాడ్ ఇదే..
హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, సాయి కిషోర్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, అల్జమర్రి జోసెఫ్ షమీ మరియు నూర్ అహ్మద్, KS భరత్, ఒడియన్ స్మిత్, కేన్ విలియమ్సన్
Look who’s got a message for you, #TitansFAM! ?
Hear from our new recruit, Kane Williamson… ?
Drop a welcome message for our Kiwi bhai ✍?#IPLAuction | #TATATIPL | #AavaDe pic.twitter.com/NZQLQn6lpW
— Gujarat Titans (@gujarat_titans) December 23, 2022
ఐపీఎల్ లైవ్ యాక్షన్ లైవ్ ఇక్కడ వీక్షించండి




