AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma : రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు..ఇంగ్లాండ్ టూర్ ఆ ఒక్కదానికే పెద్ద పరీక్ష

Rohit Sharma : వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్ రోహిత్ శర్మకు ఒక అద్భుతమైన అవకాశమని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగబోయే 50 ఓవర్ల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తరఫున రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించగలడా లేదా అని నిరూపించుకోవడానికి ఈ సిరీస్ ఒక పెద్ద పరీక్షలాంటిదని గవాస్కర్ స్పష్టం చేశారు.

Rohit Sharma :  రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు..ఇంగ్లాండ్ టూర్ ఆ ఒక్కదానికే పెద్ద పరీక్ష
Rohit Sharma
Rakesh
|

Updated on: Jun 30, 2026 | 8:05 AM

Share

Rohit Sharma : టీమిండియా సీనియర్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సోమవారం ఒక కీలక ప్రకటన చేశారు. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్ రోహిత్ శర్మకు ఒక అద్భుతమైన అవకాశమని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగబోయే 50 ఓవర్ల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తరఫున రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించగలడా లేదా అని నిరూపించుకోవడానికి ఈ సిరీస్ ఒక పెద్ద పరీక్షలాంటిదని గవాస్కర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ భారత్ తరఫున ఒకే ఒక్క ఫార్మాట్‌పై దృష్టి పెట్టారని, జూలై 14 నుంచి 19 వరకు ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో వీరు మళ్లీ బరిలోకి దిగుతున్నారని తెలిపారు.

సోని స్పోర్ట్స్ నిర్వహించిన ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమంలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ‘రోహిత్ శర్మ గురించి ఎప్పుడు చర్చ జరగలేదు చెప్పండి? ఆయన ఆటపై ఎప్పుడూ సోషల్ మీడియాలో, క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతూనే ఉంటుంది. అయితే, వచ్చే వన్డే ప్రపంచకప్‌లో తన స్థానం ఏంటనేది రోహిత్‌కు బాగా తెలుసు. జట్టులోని కీలక వ్యక్తులకు, రోహిత్ శర్మకు మధ్య ఈ విషయమై ఇప్పటికే స్పష్టమైన కమ్యూనికేషన్ జరిగిందని నేను అనుకుంటున్నాను. రాబోయే ఏడాదిన్నర కాలంలో వరల్డ్ కప్ ముగిసే వరకు అతను జట్టులో కొనసాగాలంటే నిలకడగా పరుగులు సాధించాల్సిందే’ అని గవాస్కర్ విశ్లేషించారు.

రోహిత్ శర్మకు ఉన్న అద్భుతమైన టాలెంట్, బ్యాటింగ్ నైపుణ్యం వల్ల అతను ఎలాంటి మానసిక ఒత్తిడికి లోనయ్యే వ్యక్తి కాదని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ‘ఈ ఇంగ్లాండ్ పర్యటన రోహిత్ శర్మకు ఒక సువర్ణావకాశం. ఏడాదిన్నర తర్వాత కూడా తానే టీమిండియాకు ఓపెనర్‌గా ఉంటానని చాటిచెప్పడానికి ఇదొక సరైన వేదిక’ అని అన్నారు. సాధారణంగా వయసు 35 ఏళ్లు దాటిన క్రికెటర్లపై వారి ఫామ్ కంటే కూడా ఫిట్‌నెస్ పైనే అందరి దృష్టి ఉంటుందని, అయితే రోహిత్, కోహ్లీ ఇద్దరికీ ఉన్న అపారమైన అనుభవంతో ఈ ఫిట్‌నెస్ సవాళ్లను సులువుగా అధిగమించగలరని గవాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

టీమిండియాలో ఆడే ఏ ఆటగాడికైనా కెరీర్ ఆరంభం నుంచి చివరి వరకు పరీక్షలు, విమర్శలు సర్వసాధారణమని గవాస్కర్ గుర్తు చేశారు. ‘ఒక యువ ఆటగాడు జట్టులోకి అడుగుపెట్టినప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడిని ఎలా తట్టుకుంటాడు? ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొంటాడు? అని నిశితంగా గమనిస్తారు. సీనియర్లయిన తర్వాత కూడా పరుగులు చేస్తూనే ఉండాలి. క్యాచ్‌లు పట్టడం, రనౌట్‌లు చేయడం మాత్రమే కాదు.. తాము గతంలో కెప్టెన్లుగా చేసిన అనుభవంతో ప్రస్తుత కెప్టెన్‌కు మైదానంలో విలువైన సలహాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ నిఘా లేదా విమర్శలు రోహిత్, విరాట్‌లకు కొత్తేమీ కాదు’ అని గవాస్కర్ చెప్పుకొచ్చారు. ఇదే ఇంటర్వ్యూలో ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సమయంపై గవాస్కర్ కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?