WPL 2024 Auction: భారత ప్లేయర్లపై కన్నేసిన జట్లు.. అత్యధిక ప్రైజ్ లిస్టులో ముగ్గురు..
WPL 2024 Auction: ఇందులో ఐదు జట్లు మొత్తం రూ.17.65 కోట్లతో కొనుగోలు చేయనున్నాయి. ఈ జట్లు గరిష్టంగా 30 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. ఇందులో 9 మంది విదేశీ ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంటుంది. వేలానికి ముందు, జట్లు చాలా మంది ఆటగాళ్లను విడుదల చేశాయి. ఈ జాబితాలో మాన్సీ జోషి, దేవికా వైద్య కూడా ఉన్నారు. అయితే, వీరు వేలంలో భారీ మొత్తం పొందవచ్చని తెలుస్తోంది.

WPL 2024 Auction Mansi Joshi: మహిళల ప్రీమియర్ లీగ్ 2024 కోసం వేలం శుక్రవారం ముంబైలో జరగనుంది. ఇందులో ఐదు జట్లు మొత్తం రూ.17.65 కోట్లతో కొనుగోలు చేయనున్నాయి. ఈ జట్లు గరిష్టంగా 30 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. ఇందులో 9 మంది విదేశీ ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంటుంది. వేలానికి ముందు, జట్లు చాలా మంది ఆటగాళ్లను విడుదల చేశాయి. ఈ జాబితాలో మాన్సీ జోషి, దేవికా వైద్య కూడా ఉన్నారు. అయితే, వీరు వేలంలో భారీ మొత్తం పొందవచ్చని తెలుస్తోంది.
మాన్సీ జోషి..
అనుభవజ్ఞురాలైన భారత క్రీడాకారిణి మాన్సీ పలు సందర్భాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. గత సీజన్‌లో ఆమె గుజరాత్ జెయింట్స్ తరపున ఆడింది. అయితే, ఇప్పుడు ఆమె విడుదలైంది. అంతర్జాతీయ టీ20లో మాన్సీ 3 వికెట్లు పడగొట్టింది. వన్డేల్లో 16 వికెట్లు పడగొట్టింది. వేలంలో మాన్సీపై భారీ పందెం వేయవచ్చు. మాన్సీ అనుభవం టోర్నీలో జట్టుకు ఉపయోగపడుతుంది.
దేవికా వైద్య..
దేవిక వైద్య యూపీ వారియర్స్ ప్లేయర్. అయితే, యూపీ ఇప్పుడు ఆమెను విడుదల చేసింది. దేవిక బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ నిష్ణాతురాలిగా పేరుగాంచింది. ఆమె ఆల్ రౌండర్ ఆటగాడు. దేవిక ఇప్పటివరకు ఆడిన 17 టీ20 మ్యాచ్‌ల్లో 10 వికెట్లతో పాటు 90 పరుగులు చేసింది. వన్డేల్లో 12 వికెట్లు పడగొట్టిన ఆమె 179 పరుగులు కూడా చేసింది.
మేగాన్ షట్..
ఆస్ట్రేలియన్ ప్లేయర్ మేగాన్ షట్ ఇప్పటివరకు కెరీర్‌లో దూసుకపోయింది. ఆమె గత సీజన్‌లో RCB తరపున ఆడింది. అయితే ఈసారి RCB ఆమె విడుదల అయింది. మేగాన్ షట్‌పై వేలంలో జట్లు పెద్ద బిడ్‌లు వేయవచ్చు. ఇప్పటి వరకు ఆమె కెరీర్‌ను పరిశీలిస్తే, అది ఎఫెక్టివ్‌గా ఉంది. షట్ 85 వన్డేల్లో 115 వికెట్లు తీసింది. 102 టీ20 మ్యాచుల్లో 130 వికెట్లు పడగొట్టింది. అంతేకాదు టెస్టు మ్యాచ్‌లు కూడా ఆడింది. మేగన్ 9 టెస్టు వికెట్లు కూడా తీసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..