Asia Cup: టీమిండియా ప్రాబబుల్ స్వ్కాడ్ ఇదే.. ఆ ముగ్గురిని చూసి వణుకుతున్న పాక్.. ఎవరంటే?
India Pakistan Cricket News: వచ్చే నెలలో జరగనున్న ఆసియా కప్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ కోసం భారత జట్టును ఇంకా ప్రకటించలేదు. కానీ ఈ పోటీలో భారత్ చేతిలో ఓడిపోతామనే భయం పాకిస్తాన్ జట్టును వెంటాడుతోంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం, టీం ఇండియా ఆసియా కప్‌లోకి ప్రవేశిస్తే, భారత్ వర్సెస్ పాకిస్తాన్ రెండుసార్లు తలపడతాయి. కాబట్టి, పాకిస్తాన్ రెండు సార్లు ఓడిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Players of India in Asia Cup Championship 2025: ఆసియా కప్‌లో భారత జట్టు పాకిస్థాన్‌తో ఆడుతుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. మ్యాచ్‌ల షెడ్యూల్ బయటకు వచ్చి ఉండవచ్చు. కానీ, భారతదేశంలో దీనికి తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆగస్టు 19 లేదా 20 తేదీల్లో భారత్ ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించబోతున్నందున పాకిస్తాన్ కూడా ప్రశాంతంగా లేదు. దీనికి ముందే, పాకిస్తాన్ టీమిండియా ప్రాబబుల్ స్వ్కాడ్‌తో భయపడి, మ్యాచ్ ఆడటానికి ముందే తన ఓటమిని ఊహించుకుంటోంది.
గర్జించేందుకు సిద్ధమైన అభిషేక్, రింకు సింగ్..!
అభిషేక్ దుమ్ము రేపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రింకూ సింగ్ కూడా గర్జిస్తాడని భావిస్తున్నారు. శుభమ్ గిల్‌కి కొందరు భయపడుతున్నారు. స్కై ట్రాక్ రికార్డ్ చూసి మరికొందరు షాక్ అవుతున్నారు. అంటే, నిన్నటి వరకు ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న పాకిస్తాన్.. టీమిండియా ఆసియా కప్ జట్టును చూసిన తర్వాత వణికిపోతున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర బాబర్-రిజ్వాన్ లాంటి సీనియర్లు తప్ప టీ-20లో భారత యువ ప్రతిభను ఎదుర్కోగల ఆటగాళ్ళు లేరు.
నిజానికి, పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడటానికి భారతదేశంలో వ్యతిరేకత ఉండవచ్చు. ఆసియా కప్ జట్టును ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, పాకిస్తానీయులు ఓడిపోవడానికి ముందుగానే సిద్ధమవుతున్నారు.
ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?
సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉన్నప్పటికీ, రెండు జట్లు మైదానంలోకి దిగే వరకు మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది తుది నిర్ణయంగా పరిగణించలేం. అంటే, అప్పటి వరకు పాకిస్తానీయులు భయం గుప్పిట్లోనే ఉంది. మొదటిది, మ్యాచ్ జరగదనే భయం, రెండవది, మ్యాచ్ జరిగితే ఓడిపోతామనే భయం.
రెండు సందర్భాలలోనూ పాకిస్తాన్‌కు షాకే..
ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం, టీం ఇండియా ఆసియా కప్‌లోకి ప్రవేశిస్తే, భారత్ వర్సెస్ పాకిస్తాన్ రెండుసార్లు తలపడతాయి. కాబట్టి, పాకిస్తాన్ రెండు సార్లు ఓడిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








