AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుభ్మన్ గిల్‌కు 2 మద్యం బాటిళ్లు ఎందుకిచ్చారో తెలుసా.. మెడల్‌పై ఏం రాసి ఉందంటే..?

గిల్ తన ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పతకంతో ఫోటో దిగాడు. ఎత్తైన భవనంపై ఈ సెల్ఫీని తీసుకున్నాడు. ఈ పతకం ఒక వైపున రోథెసే టెస్ట్ సిరీస్ అని రాసి ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ vs ఇండియా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అని ముద్రించారు. ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్ అద్భుతంగా రాణించాడు.

శుభ్మన్ గిల్‌కు 2 మద్యం బాటిళ్లు ఎందుకిచ్చారో తెలుసా.. మెడల్‌పై ఏం రాసి ఉందంటే..?
Shubman Gill Gets 2 Wine Bo
Venkata Chari
|

Updated on: Aug 05, 2025 | 2:00 PM

Share

భారత క్రికెట్‌కు నవశకం మొదలైంది. ఇంగ్లాండ్‌తో జరిగిన 5 టెస్టుల సిరీస్‌లో యువ కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ నాయకత్వంలో టీమిండియా 2-2తో సిరీస్ ను డ్రా చేసుకొని చరిత్ర సృష్టించింది. ఓవల్‌లో జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత గిల్ ను ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా అతనికి ఒక పతకంతో పాటు, ప్రత్యేక బహుమతిగా రెండు వైన్ బాటిళ్లు లభించాయి. ఇది ఇంటర్నెట్ లో చర్చనీయాంశంగా మారింది.

గిల్ అద్భుత ప్రదర్శన..

ఈ సిరీస్‌లో శుభ్ మ‌న్ గిల్ బ్యాటింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లాండ్ గడ్డపై మొట్టమొదటిసారిగా కెప్టెన్‌గా అడుగుపెట్టిన గిల్, బ్యాట్‌తోనే తన సత్తా చాటాడు. ఐదు టెస్టుల్లో మొత్తం 754 పరుగులు చేసి, ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇందులో నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి. ఎడ్జ్ బాస్టన్ టెస్టులో ఏకంగా 269, 161 పరుగుల చొప్పున రెండు అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

రెండు వైన్ బాటిళ్లు ఎందుకు?

సాధారణంగా భారత గడ్డపై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లేదా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలిచిన వారికి నగదు బహుమతులు లేదా చెక్కులు ఇస్తుంటారు. కానీ ఇంగ్లాండ్ లో సంప్రదాయం ప్రకారం వైన్ బాటిళ్లు లేదా షాంపేన్‌ను బహుమతిగా ఇస్తారు. ఈ సిరీస్ లో గిల్ రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును, ఒకసారి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. దీంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుతో పాటు మరో రెండు ఖరీదైన వైన్ బాటిళ్లు కూడా లభించాయి. వీటిలో ఒకటి చాపెల్ డౌన్ బ్రట్ స్పార్క్లింగ్ వైన్ అని, దీని విలువ దాదాపు రూ.14,000 వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇంగ్లాండ్‌లో ఈ వైన్ చాలా పేరుగాంచింది.

ఇవి కూడా చదవండి

గిల్‌కు గంభీర్, బ్రెండన్ మాక్ కలమ్‌ల ప్రశంసలు..

ఈ సిరీస్‌లో అద్భుతంగా ఆడినందుకుగాను ఇంగ్లాండ్ ప్రధాన కోచ్ బ్రెండన్ మాక్ కలమ్ గిల్‌ను “ప్లేయర్ ఆఫ్ ది సిరీస్”గా ఎంపిక చేశాడు. ఈ సందర్భంగా టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కూడా గిల్ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. ఒక యువ కెప్టెన్‌గా ఇంత ఒత్తిడిలో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరచడం చాలా గొప్ప విషయం అని గంభీర్ అన్నాడు. ఒక కోచ్‌గా, కెప్టెన్‌గా ఈ సిరీస్ డ్రా కావడం ఇద్దరికీ ఒక పెద్ద విజయంగా నిలిచింది. ఈ సిరీస్ తో శుభ్ మ‌న్ గిల్ కు ఒక గొప్ప భవిష్యత్తు ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గిల్ కు ఇచ్చిన పతకంపై ఏమి రాసి ఉంది?

గిల్ తన ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పతకంతో ఫోటో దిగాడు. ఎత్తైన భవనంపై ఈ సెల్ఫీని తీసుకున్నాడు. ఈ పతకం ఒక వైపున రోథెసే టెస్ట్ సిరీస్ అని రాసి ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ vs ఇండియా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అని ముద్రించారు. ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్ అద్భుతంగా రాణించాడు. ఇంగ్లాండ్ గడ్డపై కెప్టెన్‌గా అతను ఇంత బాగా బ్యాటింగ్ చేస్తాడని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే అతని సాంకేతిక లోపాలు అందరికీ తెలుసు. కానీ IPL సమయంలో, ఈ ఆటగాడు తన బలహీనతను బలంగా మార్చుకున్నాడు. ఆ తర్వాత బ్రిటిష్ గడ్డపై చరిత్ర సృష్టించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..