AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియా వద్దంది.. విదేశీ జట్టు ముద్దంది.. కట్ చేస్తే.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ.. ఆ ప్లేయర్ ఎవరంటే

ఈ ప్లేయర్ టీమిండియా తరపున ఆడి సంవత్సరం పైగా జరిగింది. అలాగే ఐపీఎల్ 2025లో ఏ జట్టు కూడా ఇతడు కొనుగోలు చేయలేదు. కానీ విదేశీ జట్టు ముద్దంది.. కట్ చేస్తే.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసి అదరగొట్టాడు. ఆ ప్లేయర్ ఎవరంటే

టీమిండియా వద్దంది.. విదేశీ జట్టు ముద్దంది.. కట్ చేస్తే.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ.. ఆ ప్లేయర్ ఎవరంటే
Team India
Ravi Kiran
|

Updated on: May 13, 2025 | 7:40 PM

Share

ప్రస్తుతం భారత ఆటగాళ్లు ఐపీఎల్‌లో తమస్థాయికి తగ్గట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. లీగ్ 18వ సీజన్‌లో చాలామంది యువ ఆటగాళ్లు తమదైన శైలి ముద్ర వేశారు. ఇక ఈసారి ఐపీఎల్‌లో భాగం కాని టీమిండియా ప్లేయర్.. అలాగే భారత జట్టుకు కూడా దూరమున్న ఈ ప్లేయర్.. విదేశీ జట్టు తరపున ఆడాడు. తొలి మ్యాచ్‌లోని సెంచరీ కొట్టి.. అందరి దృష్టిలో ఆకర్షించాడు. భారత వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ కెఎస్ భరత్ గత సంవత్సరం టీం ఇండియా తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ ఇంగ్లాండ్‌లోని ప్రతిష్టాత్మక సర్రే ఛాంపియన్‌షిప్‌లో డల్విచ్ క్రికెట్ క్లబ్ తరపున బరిలోకి దిగాడు. డల్విచ్ క్రికెట్ క్లబ్ తరపున అరంగేట్రం చేయడమే కాదు.. తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన సెంచరీ సాధించి తన జట్టును విజయపథంలో నడిపించాడు.

సర్రే ఛాంపియన్‌షిప్‌లో ఎషర్ క్రికెట్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో డల్విచ్ క్రికెట్ క్లబ్ తరపున కెఎస్ భరత్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో డల్విచ్ జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. అయితే ఆ జట్టుకు అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ఇద్దరూ తక్కువ స్కోరలకే పెవిలియన్ చేరారు. దీంతో మూడో స్థానంలో బరిలోకి దిగిన కెఎస్ భరత్.. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతూ వేగంగా పరుగులు రాబట్టాడు. మొత్తంగా కెఎస్ భరత్ 108 బంతుల్లో 124.07 స్ట్రైక్ రేట్‌తో 134 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.

కెఎస్ భరత్‌కు చాలా కీలకం..

కెఎస్ భరత్ అంతర్జాతీయ కెరీర్ 2023 సంవత్సరంలో ప్రారంభమైంది. 2024లో ఇంగ్లాండ్‌తో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. రిషబ్ పంత్‌కి గాయం కారణంగా భారత జట్టులో వచ్చిన భరత్.. పంత్ తిరిగి రాగానే తన స్థానాన్ని కోల్పోయాడు. ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్ కావడం, జట్టులోకి రీ-ఎంట్రీ అవకాశం ఉండటంతో.. ఈ ప్రదర్శన కెఎస్ భరత్‌కు చాలా కీలకం.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్