AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Auction: వేలంలో అదరగొట్టిన విరాట్ కోహ్లీ టీమ్‌మేట్.. హైదరాబాద్ పోటీపడినా.. తన్నుకుపోయిన రాయల్స్..

Yuzvendra Chahal Auction Price: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్‌ను రూ. 6.50 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది.

IPL 2022 Auction: వేలంలో అదరగొట్టిన విరాట్ కోహ్లీ టీమ్‌మేట్.. హైదరాబాద్ పోటీపడినా.. తన్నుకుపోయిన రాయల్స్..
Rcb
Ravi Kiran
|

Updated on: Feb 12, 2022 | 6:47 PM

Share

Yuzvendra Chahal Auction Price: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్‌ను రూ. 6.50 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. ముంబై, హైదరాబాద్, రాజస్థాన్ జట్ల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. మొదటిగా ముంబై, హైదరాబాద్ జట్లు ఈ ఆఫ్ స్పిన్నర్‌ కోసం పోటీ పడగా.. మధ్యలో రాజస్థాన్ చేరింది. దానితో సన్‌రైజర్స్ పోటీ నుంచి తప్పించుకుంది. ఇక రాయల్స్ బిడ్ మొత్తాన్ని పెంచుకుంటూ పోయింది. అయితే రూ.6.50 కోట్ల దగ్గర ముంబై కూడా తప్పుకోగా.. రాయల్స్.. విరాట్ కోహ్లీ ఆస్థాన బౌలర్‌ను దక్కించుకుంది.

2014లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాహల్‌ను రూ. 10 లక్షలకు దక్కించుకోగా.. అద్భుత ప్రదర్శనలు కనబరుస్తూ బెంగళూరు జట్టుకు వికెట్ టేకింగ్ బౌలర్‌గా మారాడు. 2018 ఆక్షన్‌కు చాహల్‌ను రైట్ టూ మ్యాచ్ కార్డుతో రూ.6 కోట్లకు బెంగళూరు దక్కించుకుంది. ఇప్పటిదాకా ఐపీఎల్‌లో139 వికెట్లు తీసిన చాహల్.. గతేడాది చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు.