Rajasthan Royals IPL Auction 2022: రాజస్థాన్ చేరిన హార్డ్ హిట్టర్.. జాబితాలో ఇంకెవరున్నారంటే?
Rajasthan Royals Players List: 2008లో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచింది. అప్పటి నుంచి జట్టు ప్రదర్శన చాలా నిరాశపరిచింది. గత సంవత్సరం రాజస్థాన్ 7వ స్థానంలో ఉంది.
రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)జట్టు ఐపీఎల్ (IPL Auction 2022) మొదటి సీజన్‌ను గెలుచుకుంది. అయితే అప్పటి నుంచి ఈ జట్టు ప్రదర్శన పేలవంగా తయారైంది. జట్టులో ఒకరి కంటే ఎక్కువ మంది స్టార్‌లు ఉన్నారు. ఛాంపియన్ ప్లేయర్‌పై డబ్బుల వర్షం కురిపిస్తున్నా.. కానీ, ప్రతి సంవత్సరం ఈ జట్టు నిరాశపరుస్తూనే ఉంది. 2021లో కూడా జట్టు 7వ స్థానంలో కొనసాగింది. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ లిస్ట్(Rajasthan Royals Players List)లో చాలా మంది దిగ్గజ ఆటగాళ్లను జట్టులో చేర్చుకుంది. ఇందులో ట్రెంట్ బౌల్ట్, షిమ్రాన్ హెట్మెయర్, అశ్విన్, దేవదత్ పడిక్కల్ వంటి పేర్లు ఉన్నాయి.
ఐపీఎల్ 2022 కోసం రాజస్థాన్ రాయల్స్ ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు ఫ్రాంచైజీ రూ.14 కోట్లు ఇచ్చింది. ఇంగ్లండ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ బట్లర్‌ను రూ.10 కోట్లకు అట్టిపెట్టుకున్నాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్‌ను కూడా రాజస్థాన్ రిటైన్ చేసుకుంది.
రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్ళు..
సంజు శాంసన్ – రూ.14 కోట్లు
జోస్ బట్లర్ – రూ. 10 కోట్లు
యశస్వి జైస్వాల్ – రూ. 4 కోట్లు
ట్రెంట్ బౌల్ట్ – రూ. 8 కోట్లు
షిమ్రాన్ హెట్మెయర్ – రూ. 8.50 కోట్లు
రవిచంద్రన్ అశ్విన్ – రూ. 5 కోట్లు
దేవదత్ పడిక్కల్ – రూ. 7.75 కోట్లు
ప్రసిద్ధ్ కృష్ణ- రూ. 10 కోట్లు
Also Read: KKR IPL 2022 Auction: ఫలించిన గంభీర్ స్కెచ్.. కీలక ప్లేయర్లను దక్కించుకున్న కేకేఆర్..!