Video: వామ్మో.. ఒంట్లో షేన్ వార్న్ పూనాడా ఏంటి బ్రో.. ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ అప్‌గ్రేడ్ వర్షన్ చూస్తే.. పరేషాన్ అవ్వాల్సిందే..
Ball Of The Century: ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ తన బౌలింగ్‌తో క్రికెట్ చరిత్రలో ఎన్నో మరుపురాని సన్నివేశాలకు నిదర్శనంగా మారాడు. అద్భుతమైన, కళ్లు చెదిరే వికెట్లను పడగొట్టి, తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్‌పై' బాల్ ఆఫ్ ది సెంచరీ' విసిరి వార్తల్లో నిలిచాడు. ఇది క్రికెట్ చరిత్రలోనే ఎన్నటికీ గుర్తుండిపోయే బాల్‌గా పేరుగాంచింది.

Matt Parkinson’s Ball Of The Century: ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ తన బౌలింగ్‌తో క్రికెట్ చరిత్రలో ఎన్నో మరుపురాని సన్నివేశాలకు నిదర్శనంగా మారాడు. అద్భుతమైన, కళ్లు చెదిరే వికెట్లను పడగొట్టి, తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్‌పై’ బాల్ ఆఫ్ ది సెంచరీ’ విసిరి వార్తల్లో నిలిచాడు. ఇది క్రికెట్ చరిత్రలోనే ఎన్నటికీ గుర్తుండిపోయే బాల్‌గా పేరుగాంచింది. అయితే, ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి తెరపైకి వచ్చింది. అందులో షేన్ వార్న్ లాంటి అద్భుతమైన బాల్‌ను విసిరిన స్పిన్నర్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. ఈ బంతిని ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ గా పిలుస్తున్నారు. ఈ వీడియో అందరికి షేన్ వార్న్‌ని గుర్తు చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆస్ట్రేలియన్ మాజీ వెటరన్ 1993లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ బౌలింగ్ చేశాడు. వార్న్ వేసిన బంతిని ఇంగ్లిష్ బ్యాట్స్ మెన్ మైక్ గాటింగ్ ఎదుర్కొన్నాడు. ఈ బంతికి గాటింగ్ అవుటయ్యాడు. వార్న్ వేసిన ఈ బంతిని చూసి గాటింగ్ పూర్తిగా ఆశ్చర్యపోయాడు. ఏం జరిగిందో బ్యాట్స్‌మన్‌కు అర్థం కాలేదు. వార్న్ వేసిన బంతి లెగ్ స్టంప్ వైపు వెళ్లడం చూసి, గాటింగ్ దానిని వదిలేయాలనుకున్నాడు. కానీ, అది ఆఫ్ స్టంప్‌కు తగలడంతో మ్యాచ్ కీలక మలుపు తిరిగింది.




సరిగ్గా అదే బంతి మళ్లీ కనిపించిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈసారి బంతిని ఇంగ్లీష్ స్పిన్నర్ మాట్ పార్కిన్సన్ విసిరాడు. ఈ ఘటన కౌంటీ క్రికెట్‌లో జరిగింది. ఈ బంతికి సంబంధించిన వీడియో కౌంటీ అధికారిక సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోలో మీరు పార్కిన్సన్ బంతిని లెగ్ సైడ్ కిందకు వెళ్లడం చూసి, బ్యాట్స్‌మెన్ దానిని వదిలేయాలనుకున్నాడు. కానీ, బంతి చాలా మలుపు తిరిగింది. అది నేరుగా వెళ్లి ఆఫ్ స్టంప్‌ను తాకింది.
View this post on Instagram
ఇంగ్లండ్ తరపున మూడు ఫార్మాట్లలో..
మాట్ పార్కిన్సన్ మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతను ఇప్పటి వరకు 1 టెస్టు, 5 వన్డేలు, 6 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. పార్కిన్సన్ 2019లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతను జూన్, 2022లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను టెస్ట్ ఆడాడు. పార్కిన్సన్ టెస్టులో 1 వికెట్, వన్డేలో 5, టీ20లో 7 వికెట్లు తీశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
