బయో బబుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇంగ్లాండ్‌ జట్లు… అందరికంటే ముందే చెన్నై చేరుకున్న టీమిండియా సారథి

భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌ జట్టు వచ్చేసింది. ఆ జట్టు శ్రీలంక నుంచి నేరుగా చెన్నై చేరుకుంది. భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లు హోటల్లో బయో బబుల్‌లో ఉంటున్నాయి. మొదటి రెండు..

బయో బబుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇంగ్లాండ్‌ జట్లు... అందరికంటే ముందే చెన్నై చేరుకున్న టీమిండియా సారథి
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 28, 2021 | 8:26 AM

భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌ జట్టు వచ్చేసింది. ఆ జట్టు శ్రీలంక నుంచి నేరుగా చెన్నై చేరుకుంది. భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లు హోటల్లో బయో బబుల్‌లో ఉంటున్నాయి. మొదటి రెండు టెస్టులూ చెన్నైలోనే జరగనున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆటగాళ్లు బెన్‌ స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌ ఆదివారమే ఇక్కడికి వచ్చి క్వారంటైన్‌లో ఉన్నారు.

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చెన్నై చేరుకున్నాడు. చెన్నై చేరిన వారిలో కోచ్‌ రవిశాస్త్రి, పుజారా, బుమ్రా, పంత్‌ కూడా ఉన్నారు. ఆటగాళ్లు ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు. ఆ తర్వాత ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టీస్ మొదలు పెడుతారు అని తమిళనాడు క్రికెట్‌ సంఘం తెలిపింది. తొలి టెస్టు ఫిబ్రవరి 5న చిదంబరం స్టేడియంలో మొదలు కానుంది. రెండో టెస్టు 13న ఉంటుంది. శ్రీలంకతో టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన ఇంగ్లాండ్‌ మంచి జోష్‌లో ఉంది.

ఇవి కూడా చదవండి :

ఇవాళ్టి నుంచి తెలంగాణలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం.. టార్గెట్ పెంచే దిశగా ఏర్పాట్లు.. పీఆర్‌సీ నివేదికపై నిరాశ వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు.. ప్రభుత్వాన్ని మెప్పించి ప్రయోజనాలు సాధిస్తామంటున్న నేతలు