AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs ENG: తారు రోడ్డులాంటి పిచ్.. కట్‌చేస్తే.. బౌలర్లకు కన్నీళ్లు.. బ్యాటర్లకు రికార్డులు..

Pakistan vs England, 1st Test: ముల్తాన్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిసింది. పాకిస్థాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు చేయగా, దానికి సమాధానంగా ఇంగ్లండ్ 823 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ 150 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశారు. ఈ సమయంలో వారు పాక్ బౌలర్లను భీకరంగా బాదేశారు. షాహీన్ అఫ్రిది నుంచి నసీమ్ షా వరకు బౌలర్లంతా చెలరేగిపోయారు.

PAK vs ENG: తారు రోడ్డులాంటి పిచ్.. కట్‌చేస్తే.. బౌలర్లకు కన్నీళ్లు.. బ్యాటర్లకు రికార్డులు..
Harry Brook, Joe Root
Venkata Chari
|

Updated on: Oct 10, 2024 | 9:15 PM

Share

PAK vs ENG: ముల్తాన్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిసింది. పాకిస్థాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు చేయగా, దానికి సమాధానంగా ఇంగ్లండ్ 823 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ 150 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశారు. ఈ సమయంలో వారు పాక్ బౌలర్లను భీకరంగా బాదేశారు. షాహీన్ అఫ్రిది నుంచి నసీమ్ షా వరకు బౌలర్లంతా చెలరేగిపోయారు. పాక్ బౌలర్లు నిస్సహాయంగా కనిపించారు. కెప్టెన్ షాన్ మసూద్ 7 బౌలర్లను ఉపయోగించాడు. అందులో 6 బౌలర్లు 100 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చారు. ఏడో బౌలర్ కేవలం 2 ఓవర్లు మాత్రమే వేశాడు. జో రూట్, హ్యారీ బ్రూక్ దాడి కారణంగా ముల్తాన్‌లో రికార్డుల వర్షం కురిసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఎలాంటి రికార్డులు సృష్టించిందో తెలుసుకుందాం.

ముల్తాన్‌లో నమోదైన రికార్డులు..

ముల్తాన్ పిచ్ పాక్ బౌలర్లకు శ్మశానవాటికగా మారింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 823 పరుగులు చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోరు కాగా, ఇంగ్లండ్ తరపున మూడో అత్యధిక స్కోరుగా మారింది. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా శ్రీలంక రికార్డు సృష్టించింది. 1997లో భారత్‌పై 957 పరుగులు చేసింది. ఇది కాకుండా ఇంగ్లండ్ జట్టు 1938లో 903 పరుగులు, 1930లో 849 పరుగులు చేసింది. అంతేకాదు ఇప్పటి వరకు పాకిస్థాన్‌పై ఇంగ్లండ్‌కు ఇదే అత్యధిక స్కోరు. ఇంతకు ముందు 2022లో పాకిస్థాన్‌పై ఇంగ్లండ్‌ ఒక ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 657 పరుగులు చేసింది.

జో రూట్, హ్యారీ బ్రూక్ భాగస్వామ్యం..

ఇంగ్లండ్ భారీ స్కోరులో జో రూట్, హ్యారీ బ్రూక్ భాగస్వామ్యం కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ కలిసి 454 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి 67 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. నిజానికి, ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. దీనికి ముందు, ఈ రికార్డు పీటర్ మే, మైఖేల్ కౌడ్రీ పేర్లలో ఉంది. వీరిద్దరూ 1957లో నాలుగో వికెట్‌కు 411 పరుగులు జోడించారు. ఇది కాకుండా, పాకిస్తాన్‌పై ఏ దేశానికైనా ఇది అతిపెద్ద భాగస్వామ్యం. 1958లో వెస్టిండీస్‌కు చెందిన కాన్రాడ్ హంటే, గ్యారీ సోబర్స్ కింగ్‌స్టన్‌లో పాకిస్థాన్‌పై 446 పరుగులు జోడించారు.

ముల్తాన్‌లో ఇది మూడోసారి..

రికార్డుల క్రియేట్ చేయడంలో ఇంగ్లండ్ జట్టు ఇక్కడితో ఆగలేదు. ముల్తాన్ టెస్టులో ఈ ఫార్మాట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ 250కి పైగా పరుగులు చేయడం ఇది మూడోసారి మాత్రమే. బ్రూక్ 317 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, రూట్ 262 పరుగులు చేశాడు. దీనికి ముందు 2006లో దక్షిణాఫ్రికాపై శ్రీలంకకు చెందిన మహ్లే జయవర్ధనే (374 పరుగులు), కుమార సంగక్కర (287 పరుగులు) ఈ ఘనత సాధించారు. ఇది కాకుండా, 1958లో కాన్రాడ్ హంట్ (260), గ్యారీ సోబర్స్ (365 పరుగులు) కూడా పాకిస్థాన్‌పై అదే విధంగా చేశారు. అంటే ఇలాంటి మూడు సందర్భాల్లో పాకిస్థాన్‌ రెండోసారి బలైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..