IND Vs ENG: ఆ పిచ్చోడ్ని దింపేశారోయ్.! రాసిపెట్టుకోండి.. ఇక టీమిండియాకు అస్సామే గతి
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ సిరీస్‌లోని ప్రతి మ్యాచ్‌కు ముందుగానే జట్టును ప్రకటిస్తోంది. ఈసారి రెండవ టెస్ట్ మ్యాచ్ కోసం 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. మొదటి టెస్ట్ జట్టులో ఉన్న ఏ ప్లేయర్‌ను తొలగించకపోగా.. వారితో పాటు మరో ఆటగాడు బరిలోకి దిగుతున్నాడు.

తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించిన ఇంగ్లీష్ టీం.. రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. లీడ్స్ టెస్ట్‌లో విజయం అనంతరం రెండు రోజులకు.. తన తదుపరి మ్యాచ్‌కు తుది జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్. ఈసారి టీంలోకి ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ పునరాగమనం చేయనున్నాడు. గత నాలుగైదు సంవత్సరాలుగా గాయాలతో సతమతమవుతున్న అతడు.. జూలై 2 నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌కు బరిలోకి దిగుతాడు. 4 సంవత్సరాల తర్వాత ఆర్చర్.. మళ్లీ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు.
భారత్‌తో ఆడిన చివరి టెస్ట్..
జూన్ 26, గురువారం ECB 5 టెస్ట్‌ల సిరీస్‌లోని రెండవ మ్యాచ్ కోసం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. లీడ్స్ టెస్ట్‌లో తలబడిన జట్టుతో పాటు జోఫ్రా ఆర్చర్ కూడా చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టులో బౌలర్లకు అనుభవం లేమి ఉండటంతో.. ఇప్పుడు ఆర్చర్ ఎంట్రీ ఆ జట్టుకు బలాన్ని చేకూరుస్తుంది. ఆర్చర్ తన 13 టెస్ట్ మ్యాచ్ కెరీర్‌లో 42 వికెట్లు పడగొట్టాడు. యాదృచ్ఛికంగా, ఈ 30 ఏళ్ల స్టార్ పేసర్ టీం ఇండియాతో తన చివరి టెస్ట్ ఆడాడు. ఫిబ్రవరి 2021లో భారత పర్యటనలో ఆర్చర్ తన కెరీర్‌లో 13వ టెస్ట్ మ్యాచ్ ఆడాడు.
ఐపీఎల్, కౌంటీలలో తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్న ఆర్చర్.. ఈ సంవత్సరం ప్రారంభంలో ఛాంపియన్స్ ట్రోఫీ, ఆ తర్వాత IPL 2025 సీజన్‌లో ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలు లేకుండా ఆడాడు. ఇటీవల ఇంగ్లాండ్‌లోని కౌంటీ ఛాంపియన్‌షిప్ ఆడిన ఆర్చర్.. 18 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 32 పరుగులకు 1 వికెట్ పడగొట్టాడు. సో.. ఈ ప్రదర్శన, ఫిట్‌నెస్ ప్రమాణాలకు పరిగణనలోకి తీసుకుని ఆర్చర్‌ను సెలెక్టర్లు రెండో టెస్టులో ఎంపిక చేశారు.
Jofra Archer is 𝑩𝑨𝑪𝑲 🔥
Our squad to take on India in the second Test has just dropped 📋👇
— England Cricket (@englandcricket) June 26, 2025
రెండో టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు..
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
