Surya Kumar Yadav: ఆస్పత్రిలో టీమిండియా కెప్టెన్.. ఫొటోస్ వైరల్.. సడెన్ గా సూర్యకు ఏమైంది?
టీమిండియా టీ 20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఉన్నట్లుండి ఆస్పత్రిలో కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో క్రికెట్ అభిమానులు కాస్త కంగారు పడ్డారు. ఉన్నట్లుండి సూర్య కుమార్ యాదవ్ కు ఏమైందని నెట్టంట ప్రశ్నల వర్షం కురిపించారు.

భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ఆటకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో అద్భుతంగా ఆడిన సూర్య ప్రస్తుతం జర్మనీలో ఉన్నాడు. తాజాగా శస్త్ర చికిత్స జరగడంతో తన ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులకు సమాచారం అందించారు. గత కొంత కాలంగా స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతోన్న ఈ మిస్టర్ 360 ప్లేయర్ ఐపీఎల్ పూర్తయిన వెంటనే జర్మనీ వెళ్లాడు. అక్కడే శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఇప్పుడు అదే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. స్పోర్ట్స్ హెర్నియాకు శస్త్రచికిత్స విజయవంతమైందని తన హెల్త్ అప్డేట్ ఇచ్చాడు. ‘స్పోర్ట్స్ హెర్నియాకు శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం నేను వేగంగా కోలుకుంటున్నానని చెప్పేందుకు ఎంతో సంతోషంగా ఉంది. క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టేందుకు నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’.
ప్రస్తుతం పూర్తిగా బెడ్ కే పరిమితమైన సూర్య కోలుకోవడానికి సుమారు 6 నుంచి 12 వారాలు పడుతుందని సమాచారం. కాబట్టి అతను బంగ్లాదేశ్ సిరీస్ కు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం సూర్య దృష్టంతా టీ20 ప్రపంచ కప్ 2026 పైనే ఉంది. వచ్చే ఏడాది భారతదేశం, శ్రీలంకలో జరగనున్న ఈ పొట్టి ప్రపంచకప్ కోసం సూర్య పూర్తిగా సన్నద్ధమవుతున్నాడు.
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో సూర్యకుమార్ యాదవ్ కీలక ఆటగాడు. వన్డేలు, టెస్టుల్లో అతని గణాంకాలు ఎలా ఉన్నా T20 క్రికెట్‌లో సూర్య చాలా అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. కాబట్టి అభిమానులు అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉంది. ఇరు జట్ల మధ్య 5 టెస్ట్‌ల సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ తర్వాత, జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. అక్కడ వన్డే, T20 సిరీస్‌లు ఆడనుంది. మొదటి T20 మ్యాచ్ ఆగస్టు 26న , చివరి మ్యాచ్ ఆగస్టు 31న జరుగుతుంది. T20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి-మార్చిలో భారతదేశం, శ్రీలంక దేశాల్లో జరుగుతుంది. మొత్తం 20 జట్లు ఈ టోర్నీలో ఆడతాయి. ఈ ప్రపంచ కప్‌లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవే నాయకత్వం వహించనున్నాడు.
ఆస్పత్రి బెడ్ పై సూర్య..
The India T20 Captain has successfully undergone surgery for a sports hernia in his lower right abdomen and is now on the road to recovery.
Wishing Suryakumar Yadav a speedy recovery and strong comeback 💪🏏
📸: Surya Kumar Yadav pic.twitter.com/29w8xOhmjx
— CricTracker (@Cricketracker) June 26, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




