IPL 2025 Final: RCB టైటిల్ గెలవగలదా? ఆ ప్రణాళిక వర్కవుట్ అయితే ఈ సాల కప్ నమ్దే!
2025 IPL సీజన్‌లో RCB విశేషంగా రాణించింది. లీగ్ దశలో 9 విజయాలతో టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచింది. జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో అద్భుతంగా ఆడగా, బౌలింగ్ విభాగంలో జోష్ హాజిల్‌వుడ్, క్రునాల్ పాండ్యా మెరుగైన ప్రదర్శనలు ఇచ్చారు. కెప్టెన్ రజత్ పటీదార్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు విజయవంతంగా నిలిచాయి. పంజాబ్‌ను క్వాలిఫయర్ 1లో చిత్తుచేసి ఫైనల్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం జట్టు అన్ని విభాగాల్లో స్థిరంగా ఉంది. అభిమానులు ఈసారి "Ee Sala Cup Namde" అనే నినాదాన్ని నిజం అయ్యేలా చూడాలని ఆశిస్తున్నారు.

2025 IPL సీజన్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) భారీ అంచనాల నడుమ ప్రారంభించింది. జట్టు స్థిరత్వం, కొత్త టాలెంట్, మారిన వ్యూహాలతో కూడిన ఈ సీజన్‌లో, వారు ఫైనల్‌కు చేరడంతో “RCB టైటిల్ గెలవగలదా?” అనే ప్రశ్నకు కొత్త ఉత్కంఠ నెలకొంది. జూన్ 3న జరిగే ఫైనల్లో వారు పంజాబ్ కింగ్స్‌ను ఢీకొనబోతున్నారు. 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న టైటిల్ ఆశలకు ఈసారి ముగింపు రావచ్చన్న నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
2025 సీజన్ లో RCB ఆటతీరు
RCB లీగ్ దశలో 14 మ్యాచుల్లో 9 విజయాలతో, ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దుకావడంతో 2వ స్థానంలో నిలిచింది. నెట్ రన్ రేట్: +0.301. జట్టు వివిధ వేదికలపై నిలకడగా రాణించడంతో ఈ విజయాల పరంపర సాధ్యమైంది.
LSG vs RCB (లక్నోలో): 228 లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో 230/4తో ఛేజ్ చేసిన RCB. జితేశ్ శర్మ 33 బంతుల్లో 85 నాటౌట్ – ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.
PBKS vs RCB (క్వాలిఫయర్ 1): పంజాబ్‌ను 101కి ఆలౌట్ చేసి, 10 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేజ్ చేసిన అద్భుత విజయం.
CSK vs RCB (చెన్నైలో): 17 ఏళ్ల తర్వాత చెపాక్ వేదికపై మొదటి విజయం – 50 పరుగుల తేడాతో గెలుపు.
బ్యాటింగ్ విశ్లేషణ:
టాప్ ఆర్డర్ బలంగా నిలవడం.. విరాట్ కోహ్లీ – 614 పరుగులు, సగటు 55.81, స్ట్రైక్ రేట్ 146.53 తో ఫామ్ లో ఉండటం…ఫిల్ సాల్ట్ పవర్ ప్లేలో దుమ్ములేపుతుండటం. టిమ్ డేవిడ్ మిడిల్ ఆర్డర్ లో కిల్లర్ ఫినిషర్ రోల్ పోషించడం. డెత్ ఓవర్లలో SR: 203.22 తో టిమ్ డెవిడ్ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్నాడు.
మిడిల్ ఆర్డర్ & ఫినిషర్స్: జితేశ్ శర్మ కీలక ఇన్నింగ్స్‌లు, ముఖ్యంగా LSGపై 33 బంతుల్లో 85* ఇన్నింగ్స్ ఆడటం. క్రునాల్ పాండ్యా, కీలక సమయాల్లో ప్రమోట్ చేసి విజయవంతం చేసిన వ్యూహం
బౌలింగ్ టర్న్ అరౌండ్:
పేసర్లు: జోష్ హాజిల్‌వుడ్: 21 వికెట్లు, ఎకానమీ 8.30
భువనేశ్వర్ కుమార్: 15 వికెట్లు, ఎకానమీ 9.27
స్పిన్నర్లు: క్రునాల్ పాండ్యా: 15 వికెట్లు, సుయాష్ శర్మ: 8 వికెట్లు
ఈ సీజన్‌లో బౌలింగ్ RCBకి బలంగా మారింది, గతంలో ఉన్న బలహీనతకు ముగింపు పలికింది.
నాయకత్వం & వ్యూహం:
రజత్ పటీదార్ కెప్టెన్‌గా తెలివైన నిర్ణయాలు తీసుకున్నాడు
బౌలింగ్ రొటేషన్స్, బ్యాటింగ్ ఆర్డర్ మార్పులు విజయవంతం
కోచింగ్, అనలిటిక్స్ టీమ్ మద్దతుతో తక్కిన ప్లానింగ్ ఫలించింది
ఫైనల్‌కు దారి: లీగ్ దశ: 14లో 9 విజయాలు – అన్నీ 7 అవే మ్యాచ్‌లను గెలిచిన జట్టు (ఐపీఎల్ రికార్డు)
క్వాలిఫయర్ 1: పంజాబ్‌ను ఆల్ ఔట్ చేసి, 8 వికెట్లతో విజయం
స్టాండౌట్ ప్లేయర్లు:
హాజిల్‌వుడ్ – 3 వికెట్లు
ఫిల్ సాల్ట్ – 56* (27 బంతుల్లో)
అవస్థలు / ప్రమాదాల సూచనలు: టాప్ ఆర్డర్ మీద అధిక ఆధారపడటం, టిమ్ డేవిడ్ ఫిట్‌నెస్ డౌట్ఫుల్, డెత్ ఓవర్లలో భారీ హిట్టింగ్‌కు దెబ్బ తినే అవకాశాలు
RCB టైటిల్ గెలుస్తుందా? : 2025లో RCB చాలా విభిన్నంగా కనిపిస్తుంది. మంచి ఫామ్, ప్రణాళిక, వ్యూహం, మోటివేషన్‌తో ఉంది. ఇది కేవలం అభిమానుల ఆశలపై కాదు.. అంకెలు, ప్రదర్శనలు, స్థిరత అన్నింటిలోనూ బలంగా ఉంది.
అన్ని విభాగాల్లో ప్లేయర్స్ ఫామ్ లో ఉండటం. అద్భుత నాయకత్వం, వ్యూహాత్మక అనుగుణ్యత, మెరుగైన బౌలింగ్ యూనిట్ అన్ని కలగలపి ‘Ee Sala Cup Namde’ను నిజం చేసేందుకు సిద్ధమైంది జట్టు. ఇది RCB టైటిల్ గెలిచే సంవత్సరం కావచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



