Video: జట్టు నుండి పీకేశారు.. కట్ చేస్తే.. రోడ్డు మీద చిల్లర గొడవలు పడుతున్న ఆజామూ! వీడియో వైరల్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం అభిమానులతో గొడవ పడుతున్న వీడియో వైరల్‌గా మారింది. అతని పేలవ ప్రదర్శనల నేపథ్యంలో టీ20 జట్టులో నుంచి తొలగించబడిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. పీఎస్‌ఎల్ 2025లో కూడా అతని ఫామ్ నిరాశపరిచింది. అయితే వచ్చే వన్డే సిరీస్ కోసం బాబర్‌కు మరో అవకాశం లభించడంతో అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే అన్ని విమర్శలు మధ్య బాబర్‌కు మరో అవకాశం లభించింది. ఈ ఆగస్టులో వెస్టిండీస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం బాబర్ తిరిగి పాకిస్తాన్ జట్టులో చోటు సంపాదించాడు.

పాకిస్తాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ఇటీవల తన అభిమానులతో గొడవ పడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఈ ఘటన ఆయనపై ఇటీవల పెరుగుతున్న విమర్శల నడుమ చోటుచేసుకుంది. మార్చి 2025లో పాకిస్తాన్ T20 జట్టు నుండి బాబర్‌ను తొలగించిన తరువాత, ఈ గొడవ జరగడం విశేషం. గత కొంతకాలంగా అతని ప్రదర్శన పట్ల అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. తాజా సంఘటనతో ఆయనపై ప్రజా ఆక్రోశం మరింతగా పెరిగింది.
బాబర్ ఆజంతో పాటు, ప్రస్తుత కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ కూడా న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ తర్వాత T20 జట్టులో చోటును కోల్పోయాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కొత్త మార్పులు చేస్తూ సల్మాన్ అలీ అఘాను 20 ఓవర్ల ఫార్మాట్‌కి కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అయితే ఈ మార్పులు జట్టుకు ఉపయోగపడలేదనడానికి న్యూ జిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌నే ఉదాహరణగా చెప్పొచ్చు. మైఖేల్ బ్రేస్‌వెల్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్‌ను 4-1 తేడాతో చిత్తు చేసింది.
బాబర్ గత ఏడాది నుంచే ఫామ్ లో లేడు. అతను 2024లో జరిగిన తొలి 13 టీ20 మ్యాచ్‌ల్లోనే 6 హాఫ్ సెంచరీలు సాధించాడు. కానీ సంవత్సరం చివరి నాటికి అతని బ్యాటింగ్ స్థాయిలో స్పష్టమైన పతనం కనిపించింది. మొత్తం 24 మ్యాచ్‌ల్లో కేవలం ఆరు హాఫ్ సెంచరీలే సాధించగలిగాడు. స్ట్రైక్ రేట్ 133.21గా ఉండటం అతని స్థాయికి తగ్గదని విమర్శకులు అభిప్రాయపడ్డారు. ఈ తక్కువ ప్రదర్శనలే అతని జట్టు నుండి బహిష్కరణకు కారణమయ్యాయి.
ఇంతకుముందు జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2025లోనూ బాబర్ పేలవ ఫామ్ కొనసాగింది. పెషావర్ జల్మి తరఫున కెప్టెన్‌గా బరిలోకి దిగిన అతను 10 మ్యాచ్‌ల్లో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే సాధించాడు. అందులో ఒకటి కరాచీ కింగ్స్‌పై 49 బంతుల్లో చేసిన 94 పరుగులు మాత్రమే గమనించదగిన ప్రదర్శన. ఆ మ్యాచ్‌లో అతని స్ట్రైక్ రేట్ 191.83గా ఉంది. మిగతా మ్యాచ్‌ల్లో మాత్రం ఆయన పేలవ ప్రదర్శన కొనసాగింది.
అయితే అన్ని విమర్శలు మధ్య బాబర్‌కు మరో అవకాశం లభించింది. ఈ ఆగస్టులో వెస్టిండీస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం బాబర్ తిరిగి పాకిస్తాన్ జట్టులో చోటు సంపాదించాడు. ఇది అతని కెరీర్‌కు కీలకమైన మలుపుగా మారొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. మళ్ళీ ఫామ్ ను అందుకుంటూ తన క్లాస్‌ను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం బాబర్‌కు ఉంది. వన్డేల్లో తన మార్క్ బ్యాటింగ్‌తో తిరిగి విమర్శకుల నోళ్లు మూయించగలడా అనే ప్రశ్న మాత్రం ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
After getting dropped from the Pakistan team, Babar Azam is fighting with his fans. pic.twitter.com/xYEFA7Xxk6
— M (@anngrypakiistan) May 30, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



