వారిద్దరూ ఫ్రెండ్స్… ఒకరు పీఎంగా ఎదిగితే.. మరొకరు క్రికెటర్‌ కావాలనుకున్నాడు.. కానీ భార్య కారణంగా..!

Venkata Chari

Venkata Chari |

Updated on: Jul 30, 2021 | 8:46 AM

క్రికెట్ ప్రపంచంలో వీరి కథ చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉందనడంలో సందేహం లేదు. ఒకే పాఠశాలలో చదివిన ఇద్దరు స్నేహితులు.. అనంతరం తమ గమ్యాలను వెతుక్కుంటూ వెళ్లిన ఆ ఇద్దరిలో ఒకరు విజయానికి బ్రాండ్ అంబాసిడర్‌లా మారితే.. మరొకరు మాత్రం తొలి మ్యాచ్‌తోనే కెరీర్‌ను వదులుకోవాల్సి వచ్చింది.

వారిద్దరూ ఫ్రెండ్స్... ఒకరు పీఎంగా ఎదిగితే.. మరొకరు క్రికెటర్‌ కావాలనుకున్నాడు.. కానీ భార్య కారణంగా..!
Cricket

On This Day In Cricket: క్రికెట్ ప్రపంచంలో వీరి కథ చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉందనడంలో సందేహం లేదు. ఒకే పాఠశాలలో చదివిన ఇద్దరు స్నేహితులు.. అనంతరం తమ గమ్యాలను వెతుక్కుంటూ వెళ్లిన ఆ ఇద్దరిలో.. ఒకరు విజయానికి బ్రాండ్ అంబాసిడర్‌లా మారితే.. మరొకరు మాత్రం తొలి మ్యాచ్‌తోనే కెరీర్‌ను వదులుకోవాల్సి వచ్చింది. దాంతో క్రికెట్‌ను వదిలి వైద్య రంగం వైపు అడుగులు వేశాడు. ఇది సినిమా కథ కాదు. పూర్తిగా వాస్తవం. ఒకరు క్రికెటర్ కాగా, మరొకరు రాజకీయ నాయకుడిగా ఎదిగారు.

30 జులై 1892, డాక్టర్ రాయ్ పార్క్ జన్మించాడు. రాయ్ పార్క్ చదివిన పాఠశాలలోనే రాబర్ట్ మెకెంజీ కూడా చదువుకున్నాడు. మెకెంజీ తరువాత ఆస్ట్రేలియా ప్రధాన మంత్రిగా కూడా ఎన్నికయ్యాడు. మరోవైపు రాయ్ పార్క్‌ ఆడిన తొలి మ్యాచ్‌లోనే.. తన క్రికెట్ కెరీర్ శాశ్వతంగా ముగిసింది. రాయ్ 31 డిసెంబర్ 1921 న ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున టెస్ట్ అరంగేట్రం చేసేందుకు అవకాశం పొందాడు. కానీ, ఈ మ్యాచ్‌లో రాయ్ మొదటి బంతికి బౌల్డ్ అయ్యాడు. అతని జట్టు ఈ మ్యాచ్‌ను ఇన్నింగ్స్ 91 పరుగుల తేడాతో గెలిచింది. కానీ ఆ తర్వాత రాయ్ పార్క్ ఆస్ట్రేలియా తరఫున తన రెండవ టెస్ట్‌ను ఆడలేకపోకవడం గమనార్హం. అంతటితో ఆయక క్రికెట్ కెరీరీ ముగిసియింది.

Robert Menzies And Dr Roy Park

Robert Menzies And Dr Roy Park

మ్యాచ్ ముందు రోజు రాత్రి ఏం జరిగిందంటే.. రాయ్ పార్క్ వైఫల్యం వెనుక ఓ సంఘటన ఉంది. మైదానం వెలుపల జరిగిన ఈ సంఘటనతో తన కెరీర్ ప్రమాదంలో పడుతుందని ఆయన కూడా ఊహించలేదు. రాయ్ పార్క్ భార్య ఆ రోజుల్లో గర్భవతిగా ఉంది. మ్యాచ్‌కు ఒక రోజు ముందు అతని భార్య ఇంట్లో సామాన్లు సర్దేందుకు వంగింది. దీంతో ఆమె అలా చేయడంతో కడుపులో ఉన్న బిడ్డకు చాలా ఇబ్బందిగా మారింది. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈమేరకు రాయ్.. తన భార్యతోనే రాత్రంతా హాస్పిటల్‌లో ఉన్నాడు. ఆపరేషన్ చేసి డెలివరీ చేయాల్సి వచ్చింది. దీంతో రాత్రంతా రాయ్ పార్క్ నిద్రపోకుండా గడిపాడు. విశ్రాంతి లేకుండా మ్యాచ్ ఆడాడు. దీంతో తొలి బంతికే ఔట్ అయ్యాడు. ఆ తరువాత మరలా క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వలేకపోయాడు.

Also Read: Tokyo Olympics 2020 Live: క్వార్టర్ ఫైనల్ చేరిన ఆర్చర్ దీపికా కుమారి.. షూటింగ్‌లో మను బాకర్‌పైనే అందరి చూపు

ఆ ఫాస్ట్ బౌలర్ ఆత్మహత్య చేసుకున్నాడు..! ఒక ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసిన రికార్డ్‌ ఇప్పటికీ అతడి పేరుపైనే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu