యువరాజ్ సింగ్ ట్వీట్లో ఎలాంటి తప్పు లేదు.. అతడిపై అత్యున్నత గౌరవం ఉందంటున్న టీమ్ ఇండియా ప్లేయర్..

మొతేరాలో జరిగిన గులాబి టెస్టు రెండు రోజుల్లోనే పూర్తయిన సంగతి తెలిసిందే. తక్కువ సమయంలోనే మ్యాచ్‌ ముగియడంతో టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ అసహనం వ్యక్తం చేశాడు. ‘మ్యాచ్‌

యువరాజ్ సింగ్  ట్వీట్లో ఎలాంటి తప్పు లేదు.. అతడిపై అత్యున్నత గౌరవం ఉందంటున్న టీమ్ ఇండియా ప్లేయర్..
Follow us
uppula Raju

|

Updated on: Feb 27, 2021 | 11:56 PM

మొతేరాలో జరిగిన గులాబి టెస్టు రెండు రోజుల్లోనే పూర్తయిన సంగతి తెలిసిందే. తక్కువ సమయంలోనే మ్యాచ్‌ ముగియడంతో టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ అసహనం వ్యక్తం చేశాడు. ‘మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగియడం టెస్టు క్రికెట్‌కు మంచిదని కాదని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించాడు. అంతేకాకుండా ఇలాంటి పిచ్‌లపై అనిల్‌ కుంబ్లే, హర్భజన్‌ సింగ్‌ బౌలింగ్‌ చేసుకుంటే 800 లేదా 1000 వికెట్లు సులువుగా సాధించేవాళ్లని అన్నాడు. ఏదేమైనా అక్షర్‌ పటేల్‌కు అభినందనలు. అతడు అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అశ్విన్‌, ఇషాంత్‌కు శుభాకాంక్షలు’ అని యువీ ట్వీట్‌ చేశాడు. అయితే ఈ ట్వీట్‌పై స్పందించిన టీం ఇండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ వరుస ట్వీట్లు చేశాడు. అయితే వాటి గురించి తెలియజేస్తూ అసలు విషయాలను మీడియాకు వెల్లడించాడు.

యువరాజ్‌ సింగ్‌ ట్వీట్‌ తనకేమీ తప్పుగా అనిపించలేదని, అతడి ట్వీట్‌లో ఎలాంటి తప్పుడు ఉద్దేశాలు లేవని పేర్కొన్నాడు. కెరీర్లో చాలాకాలం అతడితో కలిసి ఆడానని వెల్లడించాడు. అతడి పట్ల తనకు అత్యున్నత గౌరవం ఉందని స్పష్టం చేశాడు. నా ట్వీట్లు ప్రత్యేకంగా ఎవరో ఒకరిని ఉద్దేశించినవి కావని, తాను యువీ ట్వీట్‌ చూసినప్పుడు తనకేమి అనిపించలేదని, అది చూశాక తానేదో స్పందించాలని అనుకోలేదని అన్నాడు. అది సాధారణ ట్వీట్‌లాగే కనిపించిందని, అందులో నాకు తప్పేమీ కనిపించలేదని చెప్పాడు. చాలాకాలంగా నాకు యువీ తెలుసని, ఆయనను తానెంతో గౌరవిస్తానని, మనలో ఉన్న కొందరు అవతలి వ్యక్తులు ఏది చెప్పినా నమ్మేస్తారని అలా ఎందుకు చేస్తారో నాకర్థం కాదని అన్నాడు.

మొతేరా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ సుదీర్ఘ ఫార్మాట్‌లో నాలుగు వందల వికెట్ల మైలురాయిని అందుకున్న విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో ఆర్చర్‌ను ఔట్ చేసి ఈ ఘనత సాధించాడు. ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగంగా ఆ మైలురాయి చేరుకున్న రెండో బౌలర్‌గా యాష్‌ (77 టెస్టుల్లో) నిలిచాడు. తొలి స్థానంలో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ (72 టెస్టులు) ఉన్నాడు. ఈ సారి కూడా పిచ్ అనుకూలిస్తే మరోసారి అభిమానులు అశ్విన్ నుంచి మంచి ప్రదర్శన చూడవచ్చు. టీమ్‌ఇండియా సిరీస్‌లో ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మార్చి 4 నుంచి ఇరు జట్ల మధ్యా నాలుగో టెస్టు జరగనుంది. భారత్‌ ఇది గెలిస్తే సగర్వంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఇందుకోసం ఆటగాళ్లందరు సన్నద్ధం అవుతున్నారు. కచ్చితంగా గెలిచి ఫైనల్‌కు అర్హత సాధిస్తామని ధీమాగా ఉన్నారు.

CARONA: మీరు కళ్లజోడు పెట్టుకుంటారా..! అయితే కరోనా సోకదు..? షాకింగ్ నిజాలు వెల్లడించిన పరిశోధకులు..

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..