ఇక నుంచి అశ్విన్‌ను దిగ్గజమని పిలుస్తా.. టెస్ట్‌ల్లో 400 వికెట్లు తీయడం చాలా పెద్ద విషయం అంటున్న వెటరన్ క్రికెటర్..
Harbhajan Coments on Ashwin : మొతేరా స్టేడియంలో జరిగిన పింక్‌బాల్ టెస్టులో రవిచంద్రన్ 400 వికెట్ల ఘనత సాధించిన సంగతి అందరికి తెలిసిందే. అలాగే స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీ ధరన్ (72 మ్యాచ్‌ల్లో)
Harbhajan Coments on Ashwin : మొతేరా స్టేడియంలో జరిగిన పింక్‌బాల్ టెస్టులో రవిచంద్రన్ 400 వికెట్ల ఘనత సాధించిన సంగతి అందరికి తెలిసిందే. అలాగే స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీ ధరన్ (72 మ్యాచ్‌ల్లో) తర్వాత తక్కువ టెస్టుల్లో ఆ మైలురాయి అందుకున్న బౌలర్‌గానూ(77 మ్యాచ్‌ల్లో) రికార్డులకెక్కాడు. అయితే దీనిపై ఇప్పుడు ఇండియన్ వెటరన్ క్రికెటర్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ స్పందించాడు. ఇక నుంచి రవిచంద్రన్ అశ్విన్‌ను దిగ్గజమని పిలుస్తానని ప్రకటించాడు.
ఈ నేపథ్యంలో ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన హర్భజన్ టెస్టుల్లో 400 వికెట్లు తీయడం చాలా పెద్ద విషయమని చెప్పాడు. ‘టెస్టు మ్యాచ్‌లు ఆటగాళ్లను మానసికంగా, శారీరకంగా పరీక్షిస్తాయి. అలాంటి కఠిన పరిస్థితుల్లో ఇలాంటి ఘనత సాధించడంతో పాటు వరుసగా జట్టుకు విజయాలు అందించడం పెద్ద విశేషం. అశ్విన్‌ను దిగ్గజం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ అశ్విన్ 400 వికెట్లు తీయకపోయినా దిగ్గజమనే పేర్కొంటానని భజ్జీ స్పష్టం చేశాడు. విరాట్ అతడిని లెజెండ్ అని పిలుస్తాననడం గొప్ప విషయం. నేను కూడా అతడిని కలిసినప్పుడు లెజెండ్ అనే పిలుస్తా’ అని భజ్జీ వివరించాడు.
కాగా, పింక్‌బాల్ టెస్టు పూర్తయ్యాక టీమ్‌ఇండియా సారథి విరాట్.. ‘‘ఇప్పటి నుంచి అశ్విన్‌ను దిగ్గజమని పిలుస్తా. అతను ఈ తరం క్రికెట్ దిగ్గజం’’ అని సంబోధించిన సంగతి తెలిసిందే. మరోవైపు అశ్విన్ త్వరలోనే టెస్టుల్లో హర్భజన్ సింగ్(417), కపిల్ దేవ్(434) రికార్డులను అధిగమించే అవకాశం ఉంది. ప్రస్తుతం 401 వికెట్లతో కొనసాగుతున్న అతడు.. భజ్జీ కన్నా 16 వికెట్ల దూరంలో.. కపిల్ కన్నా 33 వికెట్ల వెనుకంజలో నిలిచాడు. త్వరలోనే మిగిలిన వికెట్లు కూడా సాధించి కుంబ్లే(619) తర్వాతి స్థానాన్ని అధిగమించే వీలుంది.
ఇదిలా ఉంటే.. తక్కువ సమయంలోనే మ్యాచ్ ముగియడంతో టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడం టెస్టు క్రికెట్‌కు మంచిదని కాదని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించాడు. అంతేకాకుండా ఇలాంటి పిచ్‌లపై అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ బౌలింగ్ చేసుకుంటే 800 లేదా 1000 వికెట్లు సులువుగా సాధించేవాళ్లని ప్రకటించాడు. ఏదేమైనా అక్షర్ పటేల్‌కు అభినందనలు. అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అశ్విన్, ఇషాంత్‌కు శుభాకాంక్షలు’ అని యువీ ట్వీట్ చేశాడు.
CARONA: మీరు కళ్లజోడు పెట్టుకుంటారా..! అయితే కరోనా సోకదు..? షాకింగ్ నిజాలు వెల్లడించిన పరిశోధకులు..