Dinesh Karthik Trolled: రోహిత్ శర్మను సరదాగా ట్రోల్ చేసిన ఇండియన్ వెటరన్ క్రికెటర్.. ఏమని చేశాడంటే..
Dinesh Karthik Trolled: బ్రిస్బేన్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి రోజు
Dinesh Karthik Trolled: బ్రిస్బేన్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి రోజు భారత పేసర్ నవ్‌దీప్ సైని బౌలింగ్ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు మధ్యలోనే మైదానం వీడాడు. ఆ ఓవర్‌లో ఒక బంతి మిగిలిపోవడంతో రోహిత్ శర్మ బౌలింగ్ చేశాడు. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇండియన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ సరదాగా రోహిత్ శర్మపై ట్రోల్ చేశాడు. టీమ్‌ఇండియా ప్రధాన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి రోహిత్‌ను చూసి నేర్చుకోవాలన్నాడు. జట్టులో కొత్త ఫాస్ట్ బౌలర్ వచ్చాడంటూ ముగ్గుర్నీ ట్యాగ్ చేసి ఓ జిఫ్‌ఫైల్‌ను పోస్టు చేశాడు. తర్వాత ఏమైందో తెలియదు కానీ దినేశ్ కార్తీక్ ఆ పోస్టును తొలగించాడు. అప్పటికే అది వైరల్‌గా మారింది. మరోవైపు సైని గాయంపై ఇంకా స్పష్టత రాలేదు.