ధోని లెక్క తప్పింది.. ఇంగ్లాండ్ గట్టెక్కింది!

బర్మింగ్‌హామ్‌: భారత్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని డీఆర్ఎస్ విషయంలో ఎప్పుడూ కరెక్ట్‌గా ఉంటాడు. అయితే ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ధోని డీఆర్ఎస్ విషయంలో విఫలమయ్యాడు. డీఆర్ఎస్‌ను ధోని రివ్యూ సిస్టంగా మార్చుకున్న ఈ సీనియర్ ఆటగాడు.. కీలకమైన మ్యాచ్ లో దాన్ని ఉపయోగించుకోవడంలో వైఫల్యం చెందాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో హార్దిక్‌ పాండ్యా వేసిన 11వ ఓవర్‌ ఐదో బంతి ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ కుడి చేతి గ్లోవ్‌ను తాకుతూ కీపర్‌ చేతిలో పడింది. […]

ధోని లెక్క తప్పింది.. ఇంగ్లాండ్ గట్టెక్కింది!
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 02, 2019 | 5:45 PM

బర్మింగ్‌హామ్‌: భారత్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని డీఆర్ఎస్ విషయంలో ఎప్పుడూ కరెక్ట్‌గా ఉంటాడు. అయితే ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ధోని డీఆర్ఎస్ విషయంలో విఫలమయ్యాడు. డీఆర్ఎస్‌ను ధోని రివ్యూ సిస్టంగా మార్చుకున్న ఈ సీనియర్ ఆటగాడు.. కీలకమైన మ్యాచ్ లో దాన్ని ఉపయోగించుకోవడంలో వైఫల్యం చెందాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో హార్దిక్‌ పాండ్యా వేసిన 11వ ఓవర్‌ ఐదో బంతి ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ కుడి చేతి గ్లోవ్‌ను తాకుతూ కీపర్‌ చేతిలో పడింది. వెంటనే భారత ఆటగాళ్లు అప్పీల్‌ చేసినా అంపైర్‌ వైడ్‌గా ప్రకటించాడు. కోహ్లి, హార్దిక్‌ క్యాచ్‌గా భావించినప్పటికి ధోని నుంచి సరైన స్పందన రాకపోవడంతో భారత్ కెప్టెన్ రివ్యూ కోసం ప్రయత్నించలేదు. కానీ అనంతరం రిప్లేలో బంతి రాయ్‌ గ్లోవ్‌ను తాకినట్లు స్నికోలో కనిపించి స్పైక్‌ ద్వారా స్పష్టమైంది. కాగా అప్పటికి రాయ్ కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఇంగ్లాండ్ స్కోర్ 49 పరుగులు. ఆ సమయంలో గనక ధోని స్పందించి.. భారత్ రివ్యూ కోరితే ఇంగ్లాండ్ తప్పకుండా ఒత్తిడిలో పడేదని అభిమానులు భావిస్తున్నారు. అయితే కొంతమంది అభిమానులు మాత్రం ధోని సరిగ్గా స్పందించకపోవడంతో అతని మీద మండిపడుతున్నారు.

ఇది ఇలా ఉంటే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ధోనికి అండగా నిలిచాడు. డీఆర్‌ఎస్‌ అంచనా విషయంలో కొన్ని సార్లు లెక్క తప్పడం సహజమేనని.. ‘స్పష్టత లేనప్పుడు డీఆర్‌ఎస్‌ అనేది చాలా క్లిష్టమైనది అని మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో రోహిత్ శర్మ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. డీఆర్ఎస్ విషయంలో ధోనిని తప్పుబట్టడం సరికాదని రోహిత్ అభిమానులను కోరాడు. అదృష్టం మనవైపు ఉంటేనే ఫలితం అనుకూలంగా వస్తుందని.. డీఆర్‌ఎస్‌ను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని రోహిత్‌ స్పష్టం చేశాడు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!