AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: ఆ విషయంలో మనమంతా వెనుకబడి ఉన్నాం.. నా కూతురు కూడా అంతే: ధోని

ధోని తన కుమార్తె జీవా కూడా శారీరక శ్రమకు దూరంగా ఉందని, భారతీయ యువతలో శారీరక శ్రమ తగ్గుముఖం పట్టిందని ఆందోళన వ్యక్తం చేశాడు. స్క్రీన్ల వాడకం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ఫిట్‌నెస్ స్థాయిలు తగ్గుతున్నాయని చెప్పాడు. ఈ సమస్యను అధిగమించడానికి శారీరక శ్రమకు ప్రాధాన్యతనివ్వాలని ధోని సూచించాడు.

MS Dhoni: ఆ విషయంలో మనమంతా వెనుకబడి ఉన్నాం.. నా కూతురు కూడా అంతే: ధోని
Ms Dhoni
SN Pasha
|

Updated on: Jul 23, 2025 | 10:54 AM

Share

టీమిండియా మాజీ క్రికెటర్‌, మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా ఉన్న మహేంద్ర సింగ్‌కి ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఏళ్లు గడుస్తున్నా.. ధోని అంటే చాలు క్రికెట్‌ అభిమానులు పడి చచ్చిపోతారు. కేవలం ధోని కోసమే ఐపీఎల్‌ చూసేవాళ్లు వాళ్లు లక్షల్లో ఉంటారు. ధోని కూడా నాలుగుపదుల వయసులో కూడా తన అభిమానుల కోసమే ఐపీఎల్‌ ఆడుతున్నాడు. ఏటికేడు వయసు పెరుగుతున్నా.. ఇంకా ఫిట్‌నెస్‌ మెయిటేన్‌ చేస్తూ ధోని ఐపీఎల్‌లో కొనసాగుతుండటం అందర్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఫిట్‌నెస్‌కు అంత ప్రాధాన్యం ఇచ్చే ధోని ఆ విషయంపైనే కీలక వ్యాఖ్యలు చేశాడు. మన దేశ యువత శారీరక శ్రమను నిర్లక్ష్యం చేస్తున్నారని, అందుకే భారతీయుల సగటు ఫిట్‌నెస్‌ స్థాయి తగ్గిందని ఆదేదన వ్యక్తం చేశాడు.

రాంచీలో జరిగిన ఒక స్థానిక కార్యక్రమంలో ధోని మాట్లాడుతూ.. భారతీయ పిల్లలు, టీనేజర్లలో శారీరక శ్రమలో తగ్గుతుందని అన్నాడు. భారతీయులుగా మన సగటు ఫిట్‌నెస్ స్థాయి తగ్గింది వెల్లడించాడు. తన కుమార్తె జీవా కూడా అంత చురుగ్గా లేదని ధోని వెల్లడించాడు. “తను పెద్దగా శారీరక శ్రమ చేయదు. ఆమెకు క్రీడల పట్ల ఆసక్తి లేదు” అని ధోని అన్నాడు. స్క్రీన్లు, డిజిటల్ పరధ్యానాలు, పట్టణ దినచర్యలు ఆధిపత్యం చెలాయించే ప్రపంచంలో ధోని చెబుతున్నట్లు యువతలో శారీరక శ్రమ తగ్గిపోయింది.

చాలా మంది ఫిజికల్‌ గేమ్స్‌ ఆడటం కంటే ఫోన్లు చూస్తూనే ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నారు. దాంతో వారి శారీరక శ్రమ కూడా తగ్గుతోంది. అలా ఉంటే ఇక ఫిట్‌నెస్‌ ఎక్కడి నుంచి వస్తుంది. శరీరం ఎలా బలపడుతుంది. పైగా ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్లకు ఊబకాయం పెద్ద సమస్యగా మారింది. చిన్న చిన్న పిల్లలు సైతం అధిక బరువుతో బాధపడుతున్నారు. ఇది ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఒక పెద్ద సమస్యగా మారుతోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి