AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ఇందుకే క్రికెట్‌ దేవుడు అయ్యాడు! సచిన్‌ లేని టీమిండియా ఎంతలా దిగజారిపోయిందో చూడండి..!

ఇంగ్లాండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్టు ఓటమి తర్వాత చాలా మంది విరాట్ కోహ్లీ ఉంటే బాగుండేదని అనుకున్నారు. కానీ, కోహ్లీ కంటే సచిన్ టెండూల్కర్ రికార్డులు ఛేజింగ్లో మెరుగ్గా ఉన్న విషయం చాలా మందికి తెలియదు. మరి ఆ రికార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం..

IND vs ENG: ఇందుకే క్రికెట్‌ దేవుడు అయ్యాడు! సచిన్‌ లేని టీమిండియా ఎంతలా దిగజారిపోయిందో చూడండి..!
Team India Sachin
SN Pasha
|

Updated on: Jul 23, 2025 | 11:22 AM

Share

ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయింది. కేవలం 193 పరుగుల లక్ష్య ఛేదనలో భారత జట్టు విఫలమైంది. అయితే తాజాగా ఈ విషయంపై ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ స్సందిస్తూ టీమిండియాపై విమర్శలు గుప్పించాడు. భారత ఓటమికి ముఖ్యంగా నమ్మకమైన ఛేజింగ్ మాస్టర్ అయిన విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్‌ టీమిండియాలో లేకపోవడమే అని హార్మిసన్ అభిప్రాయపడ్డాడు. అయితే కోహ్లీ తన కెరీర్‌లో విదేశాల్లో తొమ్మిది సార్లు మాత్రమే రెండో ఇన్నింగ్స్‌లో ఛేజింగ్‌కు దిగాడు. అందులో ఒకే ఒక్క అర్ధ సెంచరీతో 41.60 సగటుతో 208 పరుగులు చేశాడు. ఈ విషయంలో కోహ్లీ కంటే సచిన్‌ చాలా మెరుగ్గా ఉన్నాడు.

సచిన్‌ ఆడిన కాలంలో చివరి ఇన్నింగ్స్‌లో టీమిండియా 200 అంత కంటే ఎక్కువ పరుగులను 10 సార్లు ఛేదించింది. వీటిలో సచిన్‌ 8 సార్లు భాగం అయ్యాడు. 2001 నుండి 2013లో టెండూల్కర్ రిటైర్మెంట్‌ ప్రకటించే వరకు 200 పరుగులకు పైగా ఛేజింగ్‌లలో టీమిండియా మెరుగైన జట్లలో ఒకటిగా నిలిచింది. మొత్తం 35 సార్లు టీమిండియా నాల్గవ ఇన్నింగ్స్‌లో 200 కంటే ఎక్కువ పరుగులు ఛేజింగ్‌ చేయాల్సి వచ్చింది. వాటిలో భారత్‌ 9 విజయాలు సాధించింది. ఆ కాలంలో ఇది అన్ని టీమ్స్‌ కంటే ఎక్కువ. ఈ 9 టెస్టుల్లోంచి 8 టెస్టుల్లో సచిన్‌ ఆడాడు.

అన్ని మ్యాచ్‌లు అతనే గెలిపించాడని కాదు కానీ, వాటిలో ఒక సెంచరీ, నాలుగు హాఫ్‌ సెంచరీలతో 88.8 సగటుతో 444 పరుగులు సాధించాడు. 2008 ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 387 పరుగులను ఛేజ్‌ చేయడంలో సచిక్‌ కీలక్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 103 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ గెలిపించాడు. ఇక సచిన్‌ టెండూల్కర్‌ తర్వాత టీమిండియా కేవలం 2021లో ఆస్ట్రేలియాతో గబ్బా వేదిక జరిగిన టెస్టులో 300 కంటే ఎక్కువ పరుగులు ఛేజ్‌ చేసి గెలిచింది. సో ఓవరాల్‌గా టెస్టుల్లో అందులోనా విదేశాల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో ఛేజింగ్‌ చేయాల్సి వస్తే కోహ్లీ కంటే సచిన్‌ మెరుగైన ప్రదర్శన కనబర్చాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి