AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. వికెట్లకు గురిచూస్తే పాక్ బ్యాటర్‌ కాలికి తగిలిన బంతి.. కట్‌చేస్తే.!

ఈ మ్యాచ్‌లో భారత జట్టు, పాకిస్తాన్‌ను 88 పరుగుల తేడాతో చిత్తు చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. దీప్తి శర్మ బ్యాటింగ్‌లో 25 పరుగులు చేయడంతో పాటు, బౌలింగ్‌లో 3 కీలక వికెట్లు పడగొట్టి తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించింది.

Video: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. వికెట్లకు గురిచూస్తే పాక్ బ్యాటర్‌ కాలికి తగిలిన బంతి.. కట్‌చేస్తే.!
Deepti Sharma
Venkata Chari
|

Updated on: Oct 06, 2025 | 10:08 AM

Share

Deepti Sharma Video: క్రికెట్ మైదానంలో టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma) ఎప్పుడూ తన పోరాట పటిమతో వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా, మహిళల ప్రపంచ కప్ (Women’s World Cup 2025)లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆమె ప్రదర్శించిన దూకుడు.. మరోసారి చర్చనీయాంశమైంది. పాక్ బ్యాటర్‌కు బంతి తగిలిన ఘటన, ఆ తర్వాత దీప్తి ఇచ్చిన స్టైలిష్ లుక్ హాట్‌టాపిక్‌గా మారింది.

బంతి తగిలిన తర్వాత..

కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఉంది. ఆ దశలో భారత బౌలర్లు పాకిస్తాన్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో, పాక్ బ్యాటర్ సిద్రా అమీన్ (Sidra Ameen) కవ‌ర్ దిశగా బంతిని కొట్టి వేగంగా సింగిల్ తీయడానికి ప్రయత్నించింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న దీప్తి శర్మ బంతిని అందుకొని స్టంప్స్‌ను గురిపెట్టి విసిరింది.

దీప్తి వేసిన బంతి కాస్తా స్టంప్స్‌కు తగలకుండా, వేగంగా పరుగెత్తుతున్న సిద్రా అమీన్ కాలికి బలంగా తాకింది. సాధారణంగా ఇలాంటి సమయంలో క్రికెటర్లు క్షమాపణ చెప్పడం లేదా బ్యాటర్‌ను పరామర్శించడం జరుగుతుంది.

దీప్తి శర్మ రియాక్షన్..

కానీ, ఈ సంఘటనలో దీప్తి శర్మ రియాక్షన్ అందరి దృష్టిని ఆకర్షించింది. తన త్రో కాలికి తగలడంతో బాధపడిన సిద్రా అమీన్, దీప్తి వైపు కాస్త కోపంగా చూసింది. దానికి దీప్తి శర్మ ఏమాత్రం చలించకుండా, తన తప్పు లేదన్నట్లుగా, ఎలాంటి క్షమాపణ చెప్పకుండా, గంభీరంగా తిరిగి చూస్తూ (Stares Back) భుజాలు తడుముకుంది. ఫీల్డింగ్‌లో ఆటగాళ్లు అప్పుడప్పుడు ఇలా రియాక్ట్ అవుతుంటారు. మైదానంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే ఉద్రిక్తత కారణంగా ఈ సన్నివేశం మరింత హైలైట్ అయింది.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత అభిమానులు దీప్తి శర్మ తెగువను ప్రశంసిస్తుంటే, మరికొందరు క్రికెట్ స్ఫూర్తిని గుర్తుచేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో భారత జట్టు, పాకిస్తాన్‌ను 88 పరుగుల తేడాతో చిత్తు చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. దీప్తి శర్మ బ్యాటింగ్‌లో 25 పరుగులు చేయడంతో పాటు, బౌలింగ్‌లో 3 కీలక వికెట్లు పడగొట్టి తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..