AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL: టీ20ల్లో 12 వేల పరుగులు.. కట్ చేస్తే.. ఛీ పొమ్మన్న ఐపీఎల్.. ఇంతకీ ఎవరా ప్లేయర్.?

IPL 2025 మెగా వేలంలో చాలామంది వెటరన్ ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది. ఈ ప్లేయర్‌ను ఏ టీమ్ కూడా ఆఫర్ ఇవ్వలేదు. ఇప్పుడు దీంతో ఓ ప్లేయర్ పాకిస్థాన్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పాకిస్థాన్ సూపర్ లీగ్ డ్రాఫ్ట్‌లో కూడా తన పేరు నమోదు చేసుకున్నాడు.

IPL: టీ20ల్లో 12 వేల పరుగులు.. కట్ చేస్తే.. ఛీ పొమ్మన్న ఐపీఎల్.. ఇంతకీ ఎవరా ప్లేయర్.?
Ipl 2025
Ravi Kiran
|

Updated on: Jan 02, 2025 | 9:35 AM

Share

గతేడాది నవంబర్‌లో ఐపీఎల్ 2025 కోసం మెగా వేలం జరిగింది. టోర్నమెంట్‌లోని మొత్తం 10 జట్లు ఆటగాళ్లపై డబ్బు వర్షం కురిపించాయి. అయితే, కొంతమంది వెటరన్ ఆటగాళ్లకు వేలంలో చుక్కెదురు అయింది. ఆ లిస్టులో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒకడు. SRHకి ఐపీఎల్ ట్రోఫీ అందించిన వార్నర్‌ను ఫ్రాంచైజీలు పక్కనపెట్టేశాయి. దీంతో షాకింగ్ దేసిసిఒన్ తీసుకున్నాడు వార్నర్. ఐపీఎల్ వద్దని చెప్పడంతో.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు.

డేవిడ్ వార్నర్ టీ20ల్లో విజయవంతమైన ఆటగాడు. అతడు తన T20 కెరీర్‌లో 12,500 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అయినప్పటికీ, ఐపీఎల్‌లో ఏ ఫ్రాంచైజీ అతడిపై మొగ్గు చూపలేదు. అందుకే ఇప్పుడు భారత్‌ను కాదని పాకిస్థాన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ ఇటీవలే సోషల్ మీడియాలో డేవిడ్ వార్నర్ పేరును ప్రకటించింది. ఇక ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ విధ్వంసకర ఓపెనర్‌గా పేరుగాంచాడు. తన టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 389 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో, అతడు ఇండియన్ ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, వైటాలిటీ బ్లాస్ట్, ఇంటర్నేషనల్ లీగ్ T20, ఛాంపియన్స్ లీగ్‌లలో పాల్గొన్నాడు. 36.66 సగటు, 140 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 12540 పరుగులు చేశాడు.

వార్నర్ తన టీ20 కెరీర్‌లో 8 సెంచరీలు, 105 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇందులో ఐపీఎల్‌లో దాదాపు సగం మ్యాచ్‌లు అంటే 184 మ్యాచ్‌లు ఆడి 6565 పరుగులు చేశాడు. రిటైర్మెంట్‌కు ముందు వార్నర్ T20 ప్రపంచకప్‌లో కూడా పాల్గొన్నాడు. ఈ సమయంలో అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. వార్నర్ 7 మ్యాచ్‌లలో 29.66 సగటు 139 స్ట్రైక్ రేట్‌తో 178 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధసెంచరీలు ఉన్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి