AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs CSK: ఉత్కంఠ ఓటమి.. కట్‌చేస్తే.. స్పెషల్ రికార్డులో ధోని ఎంట్రీ.. ఐపీఎల్‌లో తొలి ప్లేయర్‌గా

Unique Cricket Record: ఐపీఎల్ 52వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఉత్కంఠభరితమైన విజయంతో సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో ఎనిమిదో విజయం నమోదు చేసింది. ఆర్‌సీబీ 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

RCB vs CSK: ఉత్కంఠ ఓటమి.. కట్‌చేస్తే.. స్పెషల్ రికార్డులో ధోని ఎంట్రీ.. ఐపీఎల్‌లో తొలి ప్లేయర్‌గా
Ms Dhoni Records
Venkata Chari
|

Updated on: May 04, 2025 | 11:26 AM

Share

Cricket Record: ఐపీఎల్ 52వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను 2 పరుగుల తేడాతో ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఉత్కంఠభరితమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో బెంగళూరుకు ఇది ఎనిమిదో విజయం. దీంతో ఆర్‌సీబీ జట్టు 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ చెన్నైను రెండోసారి ఓడించింది. ఐపీఎల్ సీజన్‌లో లీగ్ రౌండ్‌లో చెన్నైని రెండుసార్లు ఓడించడం ఇదే తొలిసారి.

ధోనీ బ్యాట్ పని చేయలే..

ఈ మ్యాచ్ లో చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాట్ పని చేయలేదు. అతను 8 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. ధోని తన జట్టును గెలిపించలేకపోయాడు. మ్యాచ్ తర్వాత ఓటమికి తానే బాధ్యత వహిస్తానంటూ చెప్పుకొచ్చాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్‌సీబీ 5 వికెట్లకు 213 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్లో ఆ జట్టు 15 పరుగులు చేయాల్సి వచ్చింది. కానీ, 2 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

భువనేశ్వర్ బంతికి సిక్స్..

ధోని తన చిన్న ఇన్నింగ్స్‌లో ఒక సిక్స్ కొట్టాడు. ఈ సిక్స్‌తో అతను ఒక భారీ రికార్డు సృష్టించాడు. ఆర్‌సీబీపై ఐపీఎల్ చరిత్రలో 50 సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అతను 35 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన బంతిని బౌండరీ దాటి పంపడం ద్వారా ధోని ఈ రికార్డును సృష్టించాడు.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌లో ఆర్‌సీబీపై అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్..

50*- ఎంఎస్ ధోని (35 ఇన్నింగ్స్)

44- డేవిడ్ వార్నర్ (23 ఇన్నింగ్స్)

43- కెఎల్ రాహుల్ (17 ఇన్నింగ్స్)

38- ఆండ్రీ రస్సెల్ (17 ఇన్నింగ్స్)

38- రోహిత్ శర్మ (33 ఇన్నింగ్స్)

32- జోస్ బట్లర్ (16 ఇన్నింగ్స్)

32- కీరన్ పొలార్డ్ (25 ఇన్నింగ్స్)

ఈ విషయంలో వార్నర్ మొదటి స్థానంలో..

మొత్తం రికార్డు విషయానికొస్తే, వార్నర్ ఇప్పటికీ మొదటి స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్, టీ20 ఛాంపియన్స్ లీగ్ సహా ఆర్‌సీబీతో జరిగిన 24 మ్యాచ్‌ల్లో అతను 55 సిక్సర్లు కొట్టాడు. ఈ సమయంలో అతను ఢిల్లీ క్యాపిటల్స్, న్యూ సౌత్ వేల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆడాడు. చెన్నైతో పాటు, ధోని ఐపీఎల్‌లో ఆర్‌సీబీపై పూణే సూపర్ జెయింట్స్ తరపున కూడా ఆడాడు.

ఐపీఎల్‌లో ఆర్‌సీబీపై అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్స్..

50*- ఎంఎస్ ధోని (35 ఇన్నింగ్స్)

44- డేవిడ్ వార్నర్ (23 ఇన్నింగ్స్)

43- కేఎల్ రాహుల్ (17 ఇన్నింగ్స్)

38- ఆండ్రీ రస్సెల్ (17 ఇన్నింగ్స్)

38- రోహిత్ శర్మ (33 ఇన్నింగ్స్)

32- జోస్ బట్లర్ (16 ఇన్నింగ్స్)

32- కీరన్ పొలార్డ్ (25 ఇన్నింగ్స్)

మొదటి స్థానంలో వార్నర్..

మొత్తం రికార్డు విషయానికొస్తే, వార్నర్ ఇప్పటికీ మొదటి స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్, టీ20 ఛాంపియన్స్ లీగ్ సహా ఆర్‌సీబీతో జరిగిన 24 మ్యాచ్‌ల్లో అతను 55 సిక్సర్లు కొట్టాడు. ఈ సమయంలో అతను ఢిల్లీ క్యాపిటల్స్, న్యూ సౌత్ వేల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల తరపున ఆడాడు. చెన్నైతో పాటు, ధోని ఐపీఎల్‌లో ఆర్‌సీబీపై పూణే సూపర్ జెయింట్స్ తరపున కూడా ఆడాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..