Team India: తండ్రి చేసిన తప్పు.. కట్‌చేస్తే.. టీమిండియా ప్లేయర్‌కు బిగ్ షాకిచ్చిన అధికారులు..
Jemimah Rodrigues Controversy: భారత స్టార్ మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్‌కు మంచి జరగడం లేదు. మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆమె పేలవ ప్రదర్శన తర్వాత విమర్శకుల టార్గెట్‌గా మారింది. రోడ్రిగ్స్ 4 ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి కూడా 30 పరుగులు చేయలేకపోయింది. దీంతో టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయింది. ఇప్పుడు జెమీమాకు మరో బ్యాడ్ న్యూస్ వచ్చింది.
Jemimah Rodrigues Controversy: ముంబైలోని పురాతన క్లబ్ ఖార్ జింఖానా టీమ్ ఇండియా మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఖార్ జింఖానా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, జింఖానాలో ఆమె తండ్రి కొంతమంది వ్యక్తులతో కలిసి మతపరమైన కార్యకలాపాలు చేస్తూ పట్టుబడినందున ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. బలవంతంగా మతం మార్చేందుకు ఆమె తండ్రి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
ఇటువంటి పరిస్థితిలో, ఆదివారం జరిగిన వార్షిక జనరల్ బాడీ మీటింగ్‌లో ఈ ప్లేయర్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో, జెమీమాకు సందేశాలు, ఫోన్ కాల్స్ ద్వారా మొత్తం సమాచారం అందించినట్లు తెలిపారు. అయితే ఆమె తండ్రి ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు.
ప్రజలను మతం మారుస్తున్నారంటూ ఆరోపణలు..
ఖార్ జింఖానా ప్రెసిడెంట్ వివేక్ దేవ్నానీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. జెమీమాకు 3 సంవత్సరాల సభ్యత్వం ఇచ్చినట్లు తెలిపారు. కానీ, 20 అక్టోబర్ 2024న ఆమె సభ్యత్వం రద్దు చేశామని తెలిపారు. అలాగే, మేనేజింగ్ కమిటీ సభ్యుడు శివ్ మల్హోత్రా మాట్లాడుతూ, జెమిమా రోడ్రిగ్స్ తండ్రి బ్రదర్ మాన్యువల్ మినిస్ట్రీస్ అనే సంస్థతో సంబంధం కలిగి ఉన్నారు. దాదాపు ఏడాదిన్నర పాటు రాష్ట్రపతి భవన్‌ను బుక్ చేసి 35 కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడ ఏమి జరుగుతుందో అందరికీ తెలుసు” అంటూ పేర్కొన్నారు.
అలాగే ‘దేశవ్యాప్తంగా ఏమి జరుగుతుందో వింటునే ఉన్నాం. కానీ, అంతా మా చుట్టూనే జరుగుతోంది. డ్యాన్స్‌లతోపాటు ఖరీదైన సంగీత పరికరాలు, పెద్ద తెరలు ఉపయోగిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ, ఖర్ జింఖానా నిబంధనల ప్రకారం ఇలాంటి మతపరమైన పనులు చేయడానికి మేం ఎలాంటి అనుమతి ఇవ్వం’ అంటూ తెలిపాడు.
జెమిమా రోడ్రిగ్స్ కెరీర్..
జెమీమా 2018లో భారత మహిళల క్రికెట్ జట్టుకు అరంగేట్రం చేసింది. ఆమె ఇప్పటి వరకు 3 టెస్టులు, 30 వన్డేలు, 104 టీ20 మ్యాచ్‌లు ఆడింది. 3 టెస్టుల్లో 58.75 సగటుతో 235 పరుగులు చేసింది. ఈ సమయంలో ఆమె 3 అర్ధ సెంచరీలు సాధించింది. జెమీమా 30 వన్డేల్లో 5 అర్ధ సెంచరీల సాయంతో 710 పరుగులు చేసింది. ఆమె సగటు 27.30గా ఉంది. అత్యధిక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడే అవకాశం జెమీమాకు దక్కింది. ఆమె 104 మ్యాచ్‌లలో 29.75 సగటు, 114.17 స్ట్రైక్ రేట్‌తో 2142 పరుగులు చేసింది. జెమీమా ఖాతాలో 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..