AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: భారత్ నుంచి తరలిన ఐపీఎల్ మెగా వేలం ఈవెంట్.. అసలు కారణం తెలిస్తే షాకే?

IPL 2025 మెగా వేలానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ లిస్ట్‌ను రెడీ చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే, BCCI మెగా వేలాన్ని దేశం వెలుపల నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈమేరకు ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది.

IPL 2025: భారత్ నుంచి తరలిన ఐపీఎల్ మెగా వేలం ఈవెంట్.. అసలు కారణం తెలిస్తే షాకే?
Ipl 2024
Venkata Chari
|

Updated on: Oct 22, 2024 | 11:39 AM

Share

IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు, అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నాయి. అన్ని ఫ్రాంచైజీలు తమ జాబితాను అక్టోబర్ 31లోగా విడుదల చేయాల్సి ఉంటుంది. తాజాగా బీసీసీఐ కూడా ఇందుకు సంబంధించిన నిబంధనలను స్పష్టం చేసింది. అయితే, మెగా వేలం ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిజానికి ఈ మెగా వేలాన్ని దేశం నుంచి బయటకు తీసుకెళ్లాలనే చర్చ జరుగుతోంది.

వాస్తవానికి, వేలం నవంబర్ చివరిలో నిర్వహించాల్సి ఉంది. అయితే, ఆ సమయంలో దేశంలో పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌తో బిజీగా ఉంటుంది. దీని కారణంగా వేలం నిర్వహించడానికి BCCI దేశం వెలుపల నిర్వహించేందుకు చూస్తోందంట. ఈ క్రమంలో సౌదీ అరేబియాకు ఇప్పటికే కొంతమంది అధికారులను పంపినట్లు తెలుస్తోంది. వాళ్లు తిరిగి వచ్చిన తర్వాత వేదిక నిర్ణయిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో బీసీసీఐ అధికారులు మాట్లాడుతూ.. భారతదేశంలో ఎంపికల కోసం వెతికాం. కానీ, పండుగ, పెళ్లిళ్ల సీజన్ కారణంగా, హోటల్‌లు అందుబాటులో లేవు. కాబట్టి, మేం విదేశాలలో ఎంపికల కోసం చూస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చింది.

IPL 2025 మెగా వేలం నవంబర్ 20, 25 మధ్య నిర్వహించనున్నట్లు నివేదికలు వస్తున్నాయి. వేదికను నిర్ణయించిన తర్వాత, తేదీని కూడా నిర్ణయిస్తారని సమాచారం. మీడియా నివేదికల ప్రకారం, BCCI సౌదీ అరేబియాలోని రియాద్, జెద్దా అనే రెండు నగరాల్లో ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇందులో రియాద్‌ను మొదటి ఎంపికగా పరిగణిస్తున్నారంట.

జాబితాలో లండన్-ఆస్ట్రేలియా కూడా..

అంతకుముందు, బోర్డు లండన్, దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియాలను వేదిక ఎంపికలుగా పరిగణించింది. అయితే వాతావరణం కారణంగా లండన్, టైమ్ జోన్ కారణంగా ఆస్ట్రేలియాను జాబితా నుంచి తొలగించారు. సెప్టెంబరులో, మెగా వేలానికి సంబంధించి బెంగళూరులో IPL గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. దీనిలో రిటైన్, రిలీజ్, ఫ్రాంచైజీ పర్స్ గురించి ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. ఫ్రాంచైజీ తన ఆరుగురి ఆటగాళ్లను మ్యాచ్ కార్డ్‌తో సహా ఉంచుకోవచ్చు. ఫ్రాంచైజీ ఎంతమంది భారతీయ లేదా విదేశీ ఆటగాళ్లనైనా ఉంచుకోవచ్చు. దీనిపై ఎలాంటి పరిమితి లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వయసు తేడా పెళ్లి చర్చనీయాంశం..70 ఏళ్ల వరుడి హనీమూన్ ప్లాన్ వైరల్!
వయసు తేడా పెళ్లి చర్చనీయాంశం..70 ఏళ్ల వరుడి హనీమూన్ ప్లాన్ వైరల్!
ఇరాన్‌పై దాడులకు సంబంధించి తొలి వీడియోను రిలీజ్ చేసిన ఇజ్రాయెల్
ఇరాన్‌పై దాడులకు సంబంధించి తొలి వీడియోను రిలీజ్ చేసిన ఇజ్రాయెల్
రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది..
రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది..
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్
రోజూ ఇడ్లీ, దోసెలేనా?.. పది నిమిషాల్లో 'మూంగ్లెట్' రెడీ
రోజూ ఇడ్లీ, దోసెలేనా?.. పది నిమిషాల్లో 'మూంగ్లెట్' రెడీ
Weekly Horoscope: వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు..
Weekly Horoscope: వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు..
ఇంట్లో పాలు విరిగిపోతున్నాయా? ఇలా చేస్తే రెండు రోజులు ఫ్రెష్‎గా
ఇంట్లో పాలు విరిగిపోతున్నాయా? ఇలా చేస్తే రెండు రోజులు ఫ్రెష్‎గా
జాతక దోషాలు తొలగించే ప్రదోష వ్రతం: మార్చిలో 3 ఏకంగా ప్రదోషాలు..!
జాతక దోషాలు తొలగించే ప్రదోష వ్రతం: మార్చిలో 3 ఏకంగా ప్రదోషాలు..!
భారత్ వెస్టిండీస్‌ను ఓడిస్తే.. సెమీఫైనల్ ఆడేది ఎప్పుడు?
భారత్ వెస్టిండీస్‌ను ఓడిస్తే.. సెమీఫైనల్ ఆడేది ఎప్పుడు?
భారత్-ఇరాన్ వ్యాపారం ఎంత పెద్దది? యుద్ధంతో ఎలాంటి ప్రభావం?
భారత్-ఇరాన్ వ్యాపారం ఎంత పెద్దది? యుద్ధంతో ఎలాంటి ప్రభావం?