Nitish Kumar Reddy : నితీష్ రెడ్డికి రూ.5కోట్ల లీగల్ నోటీసు.. హైకోర్టుకు ఎక్కిన కేసు
భారత ఆల్-రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి తన మాజీ స్పోర్ట్స్ ఏజెన్సీ నుండి రూ.5 కోట్ల బకాయిల కోసం లీగల్ నోటీసు అందింది. ఈ వివాదం జూలై 28న ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది. మరోవైపు, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ప్రదర్శన, మానసిక ధైర్యాన్ని ప్రశంసించారు.

Nitish Kumar Reddy : టీమిండియా యంగ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి, గాయం కారణంగా జరుగుతున్న ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ నుంచి బయటపడిన కొద్ది రోజులకే పెద్ద లీగల్ చిక్కుల్లో పడ్డాడు. తన పాత స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ స్క్వేర్ ది వన్ నుండి రూ.5 కోట్ల బకాయిలు చెల్లించలేదని అతనికి లీగల్ నోటీసు అందింది. ఈ వివాదం నితీష్ రెడ్డి 2021 నుండి 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వరకు తనను ప్రాతినిధ్యం వహించిన ఏజెన్సీతో సంబంధాలు తెంచుకోవాలని హఠాత్తుగా నిర్ణయించుకోవడం నుంచి మొదలైంది. అంతర్జాతీయ స్థాయిలో నితీష్ కు గుర్తింపు రాకముందే, అతని బ్రాండ్ ప్రోఫైల్‌ను నిర్మించడంలో ఎండార్స్‌మెంట్‌లను పొందడంలో తామే కీలక పాత్ర పోషించామని స్క్వేర్ ది వన్ ఏజెన్సీ వాదిస్తోంది. ఇండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు నితీష్ రెడ్డి ఏకపక్షంగా పార్టనర్ షిప్ క్లోజ్ చేసి, మరొక భారత టీమ్ మేట్ మేనేజర్‌తో ఒప్పందం చేసుకున్నాడని ఏజెన్సీ ఆరోపిస్తోంది.
నితీష్ బకాయిలు చెల్లించడానికి నిరాకరించడంతో, తానే వ్యక్తిగతంగా ఆ ఎండార్స్‌మెంట్ డీల్స్ సంపాదించానని చెప్పడంతో ఈ వివాదం లీగల్ రూపం దాల్చింది. ఈ కేసుతో సంబంధం ఉన్న అధికారి మాట్లాడుతూ.. ఇలాంటి వివాదాల్లో 90 శాతం కోర్టుకు వెళ్లవు, ప్రైవేట్‌గా పరిష్కరించబడతాయి. కానీ ఈ సందర్భంలో నితీష్ డబ్బులు చెల్లించేందుకు నిరాకరించాడు. తాను స్వయంగా డీల్స్ సంపాదించానని చెప్పుకున్నాడని తెలిపింది. ఈ కేసును ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ చట్టంలోని సెక్షన్ 11(6) కింద దాఖలు చేశారు. ఇది మేనేజ్‌మెంట్ అగ్రిమెంట్‌ను ఉల్లంఘించిందని ఆరోపిస్తోంది. జూలై 28న ఢిల్లీ హైకోర్టులో దీనిపై విచారణ జరగనుంది.
ఈ లీగల్ చిక్కులు నితీష్ రెడ్డికి ఉన్న సమస్యలను మరింత పెంచుతున్నాయి, ఎందుకంటే అతను ప్రస్తుతం గాయం నుండి కోలుకుంటున్నాడు. టెస్ట్ సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌ల నుండి తప్పుకున్నాడు. అతని కెరీర్‌లో ఇప్పటికే నిరాశపరిచే సమయం, ఇప్పుడు లీగల్ సమస్యలతో మరింత క్లిష్టంగా మారింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




