Team India: వన్డేల్లో ఎన్నడూ ఔట్ కాని ముగ్గురు టీమిండియా ప్లేయర్లు.. లిస్ట్‌లో ధోని జిరాక్స్..
ODI Records: వన్డే ఫార్మాట్‌లో ఎన్నో అరుదైన రికార్డులు ఉన్నాయి. కొత్తగా కొన్ని నమోదవుతుంటే, ఇప్పటికే ఉన్న వాటిలో కొన్ని బ్రేక్ అవుతున్నాయి. అయితే, ఇప్పుడు చెప్పుకోబోయే అరుదైన రికార్డులో కేవలం ముగ్గురు భారత బ్యాటర్లకు మాత్రమే చోటు దక్కింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ODI Records: క్రికెట్ చరిత్రలో పరుగులు, సెంచరీల వర్షం కురిపించిన బ్యాట్స్‌మెన్లు చాలా మందే ఉన్నారు. కానీ, వన్డే క్రికెట్‌లో ఏ బౌలర్ చేతిలోనూ అవుట్ కాని బ్యాట్స్‌మెన్స్ గురించి మీకు తెలుసా. ఈ లిస్ట్‌లో కేవలం కొందరికే ఛాన్స్ దక్కింది. ఇందులో ముగ్గురు టీమిండియా ప్లేయర్ ఉన్నాడని మీకు తెలుసా? అంటే, టీమిండియాకు చెందిన ముగ్గురు బ్యాట్స్‌మన్స్ వన్డేలో ఎప్పుడూ అవుట్ కాలేదన్నమాట.
సౌరభ్ తివారీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు, అతన్ని ధోని జిరాక్స్ అని పిలిచేవారు. సౌరభ్ తివారీ పొడవాటి జుట్టు చూసి, ప్రజలు అతన్ని ధోనితో పోల్చేవారు. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించడం ద్వారా సౌరభ్ తివారీ టీమ్ ఇండియాలో చోటు సంపాదించుకున్నాడు. సౌరభ్ తివారీ 2010లో ఆస్ట్రేలియాపై వన్డే అరంగేట్రం చేశాడు. సౌరభ్ తివారీ టీమ్ ఇండియా తరపున కేవలం మూడు వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అందులో అతను రెండు ఇన్నింగ్స్‌లలో మాత్రమే బ్యాటింగ్ చేయగలిగాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌లలోనూ సౌరభ్ తివారీ నాటౌట్‌గా నిలిచాడు. ఆ తరువాత అతన్ని జట్టు నుంచి తప్పించారు.
ఈ ఇద్దరు భారత బ్యాటర్స్ కూడా వన్డేల్లో ఎప్పుడూ అవుట్ కాలే..
సౌరభ్ తివారీ కాకుండా, భారతదేశం నుంచి మరో ఇద్దరు బ్యాటర్లు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. ప్రపంచంలో ఏ బౌలర్ కూడా వన్డే క్రికెట్‌లో వీరిని అవుట్ చేయలేకపోయారు. ఆ ఇద్దరు భారత బ్యాట్స్‌మెన్‌లను ఓసారి చూద్దాం..
ఫైజ్ ఫజల్..
ఫైజ్ ఫజల్ దేశీయ క్రికెట్‌లో తన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అందుకే అతనికి టీం ఇండియాలో కూడా అవకాశం లభించింది. కానీ, ఈ ఆటగాడు టీం ఇండియా తరపున ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. 2016లో జరిగిన ఈ వన్డే మ్యాచ్‌లో ఫైజ్ ఫజల్ జింబాబ్వేపై 55 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ అద్భుతమైన అర్ధ సెంచరీ తర్వాత కూడా అతన్ని జట్టు నుంచి తొలగించారు.
భరత్ రెడ్డి..
నేటి యువతకు భరత్ రెడ్డి పేరు తెలియకపోవచ్చు. కానీ, ఈ ఆటగాడికి కూడా భారతదేశం తరపున కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడే అదృష్టం కలిగింది. భరత్ రెడ్డి 1978 నుంచి 1981 వరకు భారతదేశం తరపున మూడు ODIలు ఆడాడు. అందులో అతనికి రెండుసార్లు బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. రెండు సార్లు అజేయంగా నిలిచాడు. ఆ తరువాత, భరత్ రెడ్డిని కూడా టీం ఇండియా నుంచి తొలగించారు. అతని కెరీర్ కూడా విషాదకరమైన ముగింపునకు చేరుకుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




