Watch Video: సెంచరీతో కెరీర్‌ను ముగించిన 38 ఏళ్ల ఆల్ రౌండర్.. 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఆడింది 5 మ్యాచులే..!

New Zealand Batsman Anaru Kitchen: న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ 89 బంతుల్లో సెంచరీ కొట్టి తన కెరీర్‌ను ముగించాడు. చివరి ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు, 2 ఫోర్లు బాదేశాడు.

Watch Video: సెంచరీతో కెరీర్‌ను ముగించిన 38 ఏళ్ల ఆల్ రౌండర్.. 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఆడింది 5 మ్యాచులే..!
Anaru Kitchen
Follow us
Venkata Chari

|

Updated on: Feb 22, 2022 | 2:55 PM

New Zealand Batsman Anaru Kitchen: ప్రతి క్రీడాకారుడు తన క్రికెట్ కెరీర్‌ను అద్భుతంగా ముగింపు పలకాలని కోరుకుంటాడు. ఒక బ్యాట్స్‌మెన్ చివరి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేస్తే దాని కంటే విశేషం మరొకటి ఉండదు. అద్భుతమైన సెంచరీతో తన 14 ఏళ్ల దేశవాళీ క్రికెట్ కెరీర్‌కు చివరి సెల్యూట్ చేసిన న్యూజిలాండ్‌(New Zealand)కు చెందిన 38 ఏళ్ల బ్యాట్స్‌మెన్ అనారు కిచెన్(Anaru Kitchen విషయంలో కూడా అలాంటిదే జరిగింది. అతను తన సెంచరీ ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు కొట్టాడు. కేవలం 89 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేశాడు. న్యూజిలాండ్ దేశవాళీ టోర్నీ ఫోర్డ్ ట్రోఫీ(Ford Trophy)లో అతను ఈ ఘనత సాధించాడు. అయితే, అతను బ్యాట్‌తో బలమైన సెంచరీ చేసినప్పటికీ, అతని జట్టు మ్యాచ్‌లో ఓడిపోవడం గమనార్హం.

అనారు కిచెన్ 2017లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20లో న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతను మొత్తం 5 టీ20ల్లో న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కానీ, ఇందులో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. ఆల్‌రౌండర్‌గా ఈ 5 టీ20ల్లో 38 పరుగులు చేసి 2 వికెట్లు తీశాడు.

దేశవాళీ క్రికెట్‌లో సెంచరీతో ముగిసిన కెరీర్.. దేశీయ క్రికెట్‌లో ఒటాగో వోల్ట్స్ తరపున ఆడిన అనారు కిచెన్, ఆక్లాండ్ ఏసెస్‌పై తన చివరి ఇన్నింగ్స్ ఆడాడు. అతను దేశవాళీ క్రికెట్‌లో తన చివరి ఇన్నింగ్స్‌లో 95 బంతుల్లో అజేయంగా 106 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను 7 సిక్సర్లు, 2 ఫోర్లు బాదాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో అతనికిది 5వ సెంచరీ.

ఆక్లాండ్ ఒటాగోను ఓడించింది.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆక్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 380 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆక్లాండ్ తరఫున గప్టిల్ 137 పరుగులు, వర్కర్ 122 పరుగులు చేశారు. 381 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వోటాగో వోల్ట్స్ జట్టు అనారు కిచెన్ అజేయ ఇన్నింగ్స్ 106 పరుగులతో 50 ఓవర్లలో 284 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 96 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Also Read: IND vs SL: రోహిత్‌కు టెస్ట్ పగ్గాలు అందించడం కరెక్ట్ కాదేమో? కీలక వ్యాఖ్యలు చేసిన భారత కీపర్

9 ఇన్నింగ్స్‌ల్లో 1195 పరుగులు.. ఒక ట్రిపుల్, రెండు డబుల్ సెంచరీలు చేసినా.. టీమిండియాలో చోటు దక్కలే..!