BCCI: అంత ఈజీగా వదిలిపెట్టం.. కఠిన చర్యలు తీసుకుంటాం: సాహా వర్సెస్ జర్నలిస్ట్ ఇష్యూపై బీసీసీఐ కీలక ఆదేశాలు

ఓ సీనియర్ జర్నలిస్ట్ తనను బెదిరిస్తూ వాట్సాప్ సందేశాలు పంపాడని టీమిండియా టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి..

BCCI: అంత ఈజీగా వదిలిపెట్టం.. కఠిన చర్యలు తీసుకుంటాం: సాహా వర్సెస్ జర్నలిస్ట్ ఇష్యూపై బీసీసీఐ కీలక ఆదేశాలు
Wriddhiman Saha
Follow us
Venkata Chari

|

Updated on: Feb 22, 2022 | 3:30 PM

Wriddhiman Saha vs Journalist Issue: ఓ సీనియర్ జర్నలిస్ట్ తనను బెదిరిస్తూ వాట్సాప్ సందేశాలు పంపాడని టీమిండియా టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పరిశీలిస్తోందని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని బోర్డు కోశాధికారి అరుణ్ సింగ్ ధుమాల్(Arun Dhumal) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. “మేం ఈ విషయం గురించి సీరియస్‌గా ఉన్నాం. దానిని పరిశీలిస్తున్నాం” అని ధుమాల్ సోమవారం న్యూస్ 9లైవ్‌తో పేర్కొన్నారు. “మొదట అతను ఎవరు, అసలు సందర్భం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తదనుగుణంగా మేం చర్యలు తీసుకుంటాం” అని ఆయన తెలిపారు.

37 ఏళ్ల సాహా, శ్రీలంకతో స్వదేశంలో జరగనున్న సిరీస్ కోసం భారత టెస్టు జట్టులో ఎంపిక కాని సంగతి తెలిసిందే. మొత్తంగా ఈ సిరీస్‌కు దూరమైన నలుగురు సీనియర్ ఆటగాళ్లలో సాహా ఒకరు. ఒక రోజు తర్వాత, సాహా ట్విట్టర్‌లో సీనియర్ జర్నలిస్ట్ నుంచి వచ్చిన సందేశాలకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అందులో వ్యక్తి సాహాను మళ్లీ ఎప్పుడూ నిన్ను ఇంటర్వ్యూ చేయనని ప్రతిజ్ఞ చేశాడు. ఇంతకంటే అవమానం ఇంకోటి ఉండదు అంటూ ఆ వ్యక్తి రాసుకొచ్చాడు.

భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, పార్థివ్ పటేల్, ఆర్పీ సింగ్, వెంకటేష్ ప్రసాద్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో ఆటగాళ్ల ప్రతినిధిగా ఉన్న ప్రజ్ఞాన్ ఓజా, భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా ఈ విషయంలో సాహాకు మద్దతుగా ట్వీట్ చేశారు.

తన ట్వీట్‌పై నెలకొన్న వివాదంపై సాహా ఎన్నో మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో కూడా మాట్లాడాడు. ఇదే విషయంలో సాహాకు మద్దతుగా నిలిచిన బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ.. బోర్డు బాధ్యతలు నిర్వహిస్తున్నంత వరకు నన్ను తొలగించబోనని హామీ ఇచ్చారని పేర్కొన్నాడు.

ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్‌ఫోతో సాహా మాట్లాడుతూ, ప్రస్తుత భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ దక్షిణాఫ్రికా పర్యటనలో సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ ‘కొత్త ముఖాలను చూడాలనుకుంటున్నారు, యువ వికెట్ కీపర్‌లను తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని” చెప్పినట్లు సాహా పేర్కొన్నాడు.

చివరగా న్యూజిలాండ్‌తో జరిగిన కాన్పూర్ టెస్టులో గాయంతో పోరాడుతున్న సమయంలోనూ సాహా.. 61 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. కానీ, జట్టులో సాహా స్థానంపై మాత్రం ఆందోళన అలాగే కొనసాగుతోంది.

సాహా ఇప్పటివరకు 40 టెస్ట్ మ్యాచ్‌ల్లో 104 మంది బ్యాట్స్‌మెన్స్‌ను పెవిలియన్ చేర్చాడు. మూడు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలు, 29.41 సగటుతో మొత్తం 1353 పరుగులు చేశాడు. తన భార్య డెంగ్యూ నుంచి కోలుకోవడంతో ఆమెతో కలిసి ఉండటానికి ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ రౌండ్ నుంచి వైదొలిగాడు.

Also Read: Watch Video: సెంచరీతో కెరీర్‌ను ముగించిన 38 ఏళ్ల ఆల్ రౌండర్.. 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఆడింది 5 మ్యాచులే..!

IND vs SL: రోహిత్‌కు టెస్ట్ పగ్గాలు అందించడం కరెక్ట్ కాదేమో? కీలక వ్యాఖ్యలు చేసిన భారత కీపర్