Viral Video: ఇదేంది బ్రో.. క్యాచ్ వదిలేశాడని కొట్టేస్తావా.. పాక్ బౌలర్ చేసిన పనికి ఫైరవుతోన్న ఫ్యాన్స్.. వైరల్ వీడియో!
Pakistan Super League: పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో జెంటిల్‌మెన్ గేమ్ క్రికెట్ ప్రతిష్ట మసకబారింది. పాక్ ఆటగాడి చర్యతో విమర్శలు వెల్లువెత్తున్నాయి.
క్రికెట్ అనేది టీమ్ గేమ్. ఇక్కడ ప్రతి క్రీడాకారుడు ఒకరితో ఒకరు కలిసి బాగా ఆడితేనే విజయం దక్కుతుంది. అందుకే దీనిని జెంటిల్‌మన్ గేమ్ అని కూడా పిలుస్తారు. కానీ, పాకిస్థాన్(Pakistan) టీ20 లీగ్‌లో ఈ జెంటిల్‌మన్ గేమ్ ప్రతిష్ట మసకబారింది. పాక్ ఆటగాడి చర్య వల్లే ఇది జరిగింది. నిజానికి, ఆటలో తప్పులు అనేకం ఉన్నాయి. ఏ ఆటగాడు ఉద్దేశపూర్వకంగా తప్పు చేయడు. ఆటగాళ్లందరూ దీన్ని బాగా అర్థం చేసుకుంటారు. అయినప్పటికీ , పాకిస్తాన్ సూపర్ లీగ్(Pakistan Super League)లో ఒక ఆటగాడు క్యాచ్‌ని మిస్ చేసినప్పుడు, అతని సీనియర్ ఆటగాళ్ళలో ఒకరికి కోపం వచ్చింది. కోపం తట్టుకోలేక మైదానంలోనే అందరి ముందు ఆ ప్లేయర్‌ని చెంపదెబ్బ కొట్టాడు. ఆ చెంపదెబ్బ కొట్టిన పాక్ ఆటగాడి పేరు హారిస్ రౌఫ్(Haris Rauf). ఈ మేరకు క్రికెట్ అభిమానులంతా హారిస్ రౌఫ్‌పై దుమ్మెత్తిపోతుస్తున్నారు.
ఫిబ్రవరి 21న పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ వర్సెస్ లాహోర్ ఖలాండర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన జరిగింది. ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ బౌలర్ హారిస్ రవూఫ్ తన మొదటి ఓవర్‌ను వేస్తున్నాడు. తన రెండో బంతికి హజ్రతుల్లా జజాయ్ కొట్టిన బంతి కమ్రాన్ గులామ్ వైపు వెళ్లింది. ఈ క్యాచ్‌ను అతను జారవిడిచాడు.
వెగటుపుట్టిస్తోన్న పీఎస్‌ఎల్.. ఇప్పటికే ఆటగాళ్లకు సక్రమంగా డబ్బులు చెల్లించడం లేదంటూ వార్తల్లో నిలిచిన పీఎస్‌ఎల్.. మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. క్యాచ్ జారవిడిచిన వెంటనే హారిస్ రవూఫ్ కోపం తట్టుకోలేకపోయాడు. అది కూడా ఆట ప్రారంభంలోనే కావడం విశేషం. అతను కోపంగా కమ్రాన్ వద్దకు వచ్చి గట్టిగా కొట్టాడు. హారిస్ రవూఫ్ తన సహచరుడితో కలిసి చేసిన ఈ చర్య కెమెరాకు చిక్కింది.
ముందు కొట్టాడు.. తరువాత హగ్ చేసుకున్నాడు.. అయితే మ్యాచ్‌లో 1.2 ఓవర్లలో జరిగిన ఈ ఘటన నెటిజన్ల ఆగ్రహానికి గురికాగా, 16.4 ఓవర్‌లో మాత్రం క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకుంది. షాహీన్ షా ఆఫ్రిది వేసిన బాల్‌ను పెషావర్ బ్యాట్స్‌మెన్ తలత్ షాట్ ఆడగా, బంతి మరోసారి కమ్రాన్ గులామ్ వైపు వెళ్లింది. అద్భుతంగా ఫీల్డింగ్ చేసి రనౌట్ చేశాడు. దీంతో వెంటనే హారిస్ రవూఫ్ అతన్ని కౌగిలించుకున్నాడు. అంతకు ముందు తాను చేసిన తప్పు గ్రహించి, ఈసారి మెచ్చుకున్నాడు. లాహోర్ ఖలందర్స్, పెషావర్ జల్మీ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌లో ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇరు జట్లు 158 పరుగులు చేశాయి. ఆ తర్వాత పెషావర్ జల్మీ సూపర్ ఓవర్‌లో లాహోర్ ఖలందర్స్‌ను ఓడించింది.
? #HBLPSL7 l #LevelHai l #LQvPZ pic.twitter.com/hg5uCFmgac
— PakistanSuperLeague (@thePSLt20) February 21, 2022