Cricket:18 ఫోర్లు,11సిక్స్‌లతో డబుల్ సెంచరీ.. పరిమిత ఓవర్ల మ్యాచ్‌లో పుజారా టీమ్‌మేట్ సంచలనం
Royal London One Day Cup 2022: ఇంగ్లండ్‌లో భారత టెస్ట్ స్పెషలిస్ట్ ఛటేశ్వర్ పుజారా అదరగొడుతున్నాడు. రాయల్ లండన్ వన్ డే కప్‌లో అతని బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురుస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ సెంచరీలు సాధించిన పుజారా తాజాగా సోమర్సెట్‌పై కూడా అర్ధసెంచరీ సాధించాడు.
Royal London One Day Cup 2022: ఇంగ్లండ్‌లో భారత టెస్ట్ స్పెషలిస్ట్ ఛటేశ్వర్ పుజారా అదరగొడుతున్నాడు. రాయల్ లండన్ వన్ డే కప్‌లో అతని బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురుస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ సెంచరీలు సాధించిన పుజారా తాజాగా సోమర్సెట్‌పై కూడా అర్ధసెంచరీ సాధించాడు. అయితే ఈసారి అతని కంటే అతని సహచరుడు 21 ఏళ్ల అలీ ఓర్ ఇన్నింగ్స్ హైలెట్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో 161 బంతులు ఎదుర్కొన్న అతను 206 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో ఏకంగా 18 ఫోర్లు, 11సిక్స్‌లు ఉన్నాయి. అలీ, పుజారా రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్ నిర్ణీత ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. అనంతరం సోమర్‌సెట్ జట్టు 196 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ససెక్స్ 201 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కాగా వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన 35వ ఆటగాడిగా అలీ నిలిచాడు. 8 సార్లు అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఫీట్ నమోద్వగా, లిస్ట్ ఎ క్రికెట్‌లో 27 సార్లు జరిగింది.
మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ససెక్స్ 61 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే అలీ, పుజారా నాలుగో వికెట్‌కు 140 పరుగుల అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. పుజారా ఔటైనా అలీ తన విధ్వంసం కొనసాగించాడు. రాలిన్స్, అలీ ఫిన్ డెల్రేతో కలిసి స్కోరుబోర్డును 386 పరుగులకు చేర్చాడు. ఆతర్వాత ససెక్స్ బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. సోమర్‌సెట్‌ను 200 పరుగుల్లోపే కట్టడి చేశారు. బ్రాడ్లీ, జేమ్స్ కోల్స్ చెరో 3 వికెట్లు తీశారు. అదే సమయంలో హెన్రీ క్రోకోంబ్ 31 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. సోమర్‌సెట్ తరఫున ఓపెనర్ ఆండ్రూ ఉమీద్ అత్యధికంగా 56 పరుగులు చేశాడు. అతడితో పాటు జార్జ్ స్కాట్ 30, జాక్ బ్రూక్స్ 28 పరుగులు చేశారు. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఆల్ఫీ అజేయంగా 27 పరుగులు చేశాడు.
That WINNING Friday feeling. ?
Brought to you by DOUBLE CENTURION Ali Orr. ?? pic.twitter.com/D3ef07xlPO
— Sussex Cricket (@SussexCCC) August 19, 2022
Another day, another win! Super proud of the team and the show they’ve put up today! Ali was outstanding ? @SussexCCC #SharkAttack pic.twitter.com/0WCfLHaqaJ
— cheteshwar pujara (@cheteshwar1) August 19, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..