CSK vs GT: ధోని సహచరుడి దెబ్బకు.. విరాట్ కోహ్లి రికార్డులకు బ్రేకులు.. ఎవరంటే?
Virat Kohli - Ruturaj Gaikwad: ఐపీఎల్ 2023 తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ చేసి విరాట్ కోహ్లీ ప్రత్యేక రికార్డును బ్రేక్ చేశాడు.
Ruturaj Gaikwad: ఐపీఎల్ 2023 మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మంగళవారం, మే 23 న జరిగింది. ఇందులో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని CSK 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్ చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. జట్టు తరపున రుతురాజ్ గైక్వాడ్ 44 బంతుల్లో 60 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రత్యేక రికార్డును గైక్వాడ్ బద్దలు కొట్టాడు.
గైక్వాడ్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. గుజరాత్, చెన్నై మధ్య ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు జరగ్గా, రుతురాజ్ గైక్వాడ్ అన్ని మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీ సాధించాడు. గైక్వాడ్ గుజరాత్‌పై 4 ఇన్నింగ్స్‌లలో 69.5 సగటు, 145.5 స్ట్రైక్ రేట్‌తో 278 పరుగులు చేశాడు. కాగా, విరాట్ కోహ్లీ గుజరాత్‌పై మూడు ఇన్నింగ్స్‌లలో 116 సగటు, 138.1 స్ట్రైక్ రేట్‌తో 232 పరుగులు చేశాడు. ఈ సమయంలో కోహ్లీ ఖాతాలో 1 సెంచరీ, 2 అర్ధ సెంచరీలు చేరాయి.
కోహ్లీని దాటేసిన గైక్వాడ్..
గుజరాత్‌పై కోహ్లీ కంటే గైక్వాడ్ ఎక్కువ పరుగులు చేశాడు. IPL 2023 మొదటి లీగ్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది, ఇందులో గుజరాత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై ఓపెనర్ గైక్వాడ్ 92 పరుగులతో ఇన్నింగ్స్ ఆడి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. గైక్వాడ్ ఇప్పటివరకు గుజరాత్‌పై నాలుగు మ్యాచ్‌ల్లో 73(48), 53(49), 92(50), 60(44) ఇన్నింగ్స్‌లు ఆడాడు.
ఫైనల్ చేరేందుకు గుజరాత్‌కు మరో అవకాశం..
చెన్నైతో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఓటమిపాలైన గుజరాత్ టాటిన్స్‌కు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంది. ఈ జట్టు తన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌ను మే 26, శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌తో ఏ జట్టు తలపడుతుందో నేడు తెలియనుంది. లక్నో వర్సెస్ ముంబై మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా తేలనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గుజరాత్‌తో రెండో క్వాలిఫయర్ ఆడనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..