Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs CSK, IPL 2021: తేలిపోయిన హైదరాబాద్ బ్యాటింగ్.. చెన్నై టార్గెట్ 135

SRH vs CSK: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్‌కింగ్స్ టీం ముందు 135 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

SRH vs CSK, IPL 2021: తేలిపోయిన హైదరాబాద్ బ్యాటింగ్.. చెన్నై టార్గెట్ 135
ఐపీఎల్ 13 వ సీజన్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తన జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు తొమ్మిది విజయాలను దక్కించుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 18 పాయింట్లతో దూసుకుపోతోంది.
Follow us
Venkata Chari

|

Updated on: Sep 30, 2021 | 9:24 PM

Sunrisers Hyderabad vs Chennai Super Kings, IPL 2021 Match: ఐపీఎల్ 2021 లో ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపుగా బయటపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్‌కింగ్స్ టీం ముందు 135 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాప్ స్కోరర్‌గా సాహా 44 పరుగులతో (46 బంతులు, 2 సిక్సులు, 1 ఫోర్) నిలిచాడు.

ఈ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ల ముందు హైదరాబాద్ టీం నిలువలేకపోయింది. ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. గత మ్యాచులో ఆకట్టుకున్న జాన్సన్ రాయ్(2) తొలి వికెట్‌గా వెనుదిరిగి వికెట్ల పతనానికి నాంది పలికాడు. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (11) ఈమ్యాచులో తేలిపోయాడు. గార్గ్ 7, అభిషేక్ శర్మ 18, అబ్దుల్ షమద్ 18, హోల్డర్ 5 వెంట వెంటనే పెవిలియన్ చేరారు. రషీద్ ఖాన్ 17, భువనేశ్వర్ కుమార్ 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇక చైన్నై బౌలర్లలో జోష్ హజల్‌వుడ్ 3 వికెట్లు, డ్వేన్ బ్రావో 2, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు.

రెండు జట్ల ఈ మ్యాచ్ చాలా విషయాలు సరిపోలడం లేదు. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ జట్టు అట్టడుగున ఉండగా, మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని సీఎస్‌కే అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్ తమ చివరి మ్యాచ్‌లో గెలిచినప్పటికీ, విజయ పరంపరను కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తుంది. కేన్ విలియమ్సన్ వరుసగా ఐదు పరాజయాల తర్వాత హైదరాబాద్‌ని విజయపథంలో నడిపించాడు. సన్ రైజర్స్ 10 మ్యాచుల్లో ఎనిమిది ఓడింది. అదే సమయంలో, చెన్నై 10 మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచింది.

Also Read: SRH vs CSK Live Score, IPL 2021: చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ 135.. సీఎస్‌కే బౌలర్ల ముందు తేలిపోయిన హైదరాబాద్

IPL 2021: ఇద్దరు దిగ్గజాల పోరులో విజయం ఎవరిదో? సురేష్ రైనా వర్సెస్ రషీద్ ఖాన్‌ల మధ్య ఆసక్తికరమైన మ్యాచ్