- Telugu News Photo Gallery Cricket photos IPL 2021 Suresh Raina vs Rashid Khan Head to Head Record in CSK vs SRH Matches Telugu Cricket News
IPL 2021: ఇద్దరు దిగ్గజాల పోరులో విజయం ఎవరిదో? సురేష్ రైనా వర్సెస్ రషీద్ ఖాన్‌ల మధ్య ఆసక్తికరమైన మ్యాచ్
Suresh Raina vs Rashid Khan: యూఏఈలో జరుగుతున్న రెండో దశ ఐపీఎల్‌లో ఇప్పటివరకు రైనా బ్యాట్‌తో ప్రత్యేకంగా ఆకట్టుకోలేకపోయాడు.
Updated on: Sep 30, 2021 | 6:26 PM

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా తప్పుకుంది. గురువారం సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో తలపడుతుంది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని CSK ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మునుపటి మ్యాచ్‌లో విజయ పరంపరను కొనసాగించాలనే ఉద్దేశ్యంతో చెన్నై సూపర్ కింగ్స్ వెళ్తుంది. ధోనీ కెప్టెన్సీలో చెన్నై వరుసగా మూడు విజయాలు నమోదు చేయడం ద్వారా ప్లేఆఫ్‌లో తమ స్థానాన్ని దాదాపుగా ధృవీకరించుకుంది. ఫాఫ్ డు ప్లెసిస్, రితురాజ్ గైక్వాడ్ జట్టుకు మంచి ఆరంభాన్ని అందిస్తున్నారు. మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు కూడా బ్యాటింగ్‌కు తమ వంతు సహాయం చేస్తున్నారు.

నేటి మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఇద్దరు లెజెండరీ ప్లేయర్‌ల మధ్య సరదా మ్యాచ్‌ను చూడవచ్చు. ఈ ఇద్దరు ఆటగాళ్లు చెన్నైకి చెందిన సురేష్ రైనా ఒకరైతే.. హైదరాబాద్ అద్భుతమైన స్పిన్నర్ రషీద్ ఖాన్ మరోకరు. సురేష్ రైనాకు వ్యతిరేకంగా రషీద్ ఖాన్ గణాంకాలు అద్భుతమైనవి.

రషీద్ ఖాన్ ఇప్పటివరకు సురేష్ రైనాకు 34 బంతులు వేశాడు. రైనా బ్యాట్ నుంచి 46 పరుగులు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో, రషీద్ మూడుసార్లు రైనాను ఔట్ చేయడంలో విజయం సాధించాడు. రషీద్ ఖాన్‌కు వ్యతిరేకంగా, రైనా కూడా ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 135.3 స్ట్రైక్ రేట్ సాధించాడు.

యూఏఈలో జరుగుతున్న రెండో దశ ఐపీఎల్‌లో ఇప్పటివరకు రైనా బ్యాట్‌తో ప్రత్యేకంగా ఆకట్టుకోలేకపోయాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 7 బంతుల్లో 11 పరుగులు చేసి రైనా పెవిలియన్ చేరాడు. సెకండ్ లెగ్ మొదటి మ్యాచ్‌లో కూడా రైనా బ్యాట్ నుంచి పెద్దగా పరుగులు రాలేదు. అతను ముంబైపై 6 బంతుల్లో కేవలం 4 పరుగులు చేశాడు.

ఐపీఎల్ 2021 లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో రషీద్ ఖాన్ 13 వికెట్లు తీశాడు. సన్‌రైజర్స్‌కు రషీద్ అత్యంత ముఖ్యమైన ఆయుధం. అతను ఎప్పుడైనా మ్యాచ్ గమనాన్ని మార్చగలడు. నేటి మ్యాచ్‌లో కూడా అందరి దృష్టి అతని బౌలింగ్‌పైనే ఉంటుంది.





























