IPL2021, SRH vs CSK Match Result: ధోనిసేనదే విజయం.. 6 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఓటమి

SRH vs CSK, IPL 2021: చివరి ఓవర్‌ వరకు సాగిన ఈ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ టీం 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తక్కువ స్కోరే అయినా చివరి ఓవర్‌ వరకు ధోని సేన కష్టపడింది.

IPL2021, SRH vs CSK Match Result: ధోనిసేనదే విజయం.. 6 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఓటమి
Ipl 2021, Srh Vs Csk
Follow us
Venkata Chari

|

Updated on: Sep 30, 2021 | 11:30 PM

Sunrisers Hyderabad vs Chennai Super Kings, IPL 2021 Match: చివరి ఓవర్‌ వరకు సాగిన ఈ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ టీం 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తక్కువ స్కోరే అయినా చివరి ఓవర్‌ వరకు ధోని సేన కష్టపడింది. 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ 45, డుప్లెసిస్ 41 పరుగులతో మంచి ఆరంభాన్ని అందిచారు. వీరిద్దరు ఔటయ్యాక వెంటవెంటనే వికెట్లు కోల్పోయి చివరి ఓవర్‌ వరకు కష్టపడ్డారు. చివరకు ధోని 14, అంబటి రాయుడు 17 పరుగులతో చెన్నై విజయాన్ని ఖాయం చేశారు. అలీ 17, సురేష్ రైనా 2 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. జాన్సన్ హోల్డర్ 3, రషీద్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్‌కింగ్స్ టీం ముందు 135 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాప్ స్కోరర్‌గా సాహా 44 పరుగులతో (46 బంతులు, 2 సిక్సులు, 1 ఫోర్) నిలిచాడు.

ఈ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ల ముందు హైదరాబాద్ టీం నిలువలేకపోయింది. ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. గత మ్యాచులో ఆకట్టుకున్న జాన్సన్ రాయ్(2) తొలి వికెట్‌గా వెనుదిరిగి వికెట్ల పతనానికి నాంది పలికాడు. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (11) ఈమ్యాచులో తేలిపోయాడు. గార్గ్ 7, అభిషేక్ శర్మ 18, అబ్దుల్ షమద్ 18, హోల్డర్ 5 వెంట వెంటనే పెవిలియన్ చేరారు. రషీద్ ఖాన్ 17, భువనేశ్వర్ కుమార్ 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

Also Read: SRH vs CSK, IPL 2021: తేలిపోయిన హైదరాబాద్ బ్యాటింగ్.. చెన్నై టార్గెట్ 135

SRH vs CSK Highlights, IPL 2021: 6 వికెట్ల తేడాతో చెన్నై విజయం.. చివరి ఓవర్‌ వరకు కష్టపడ్డ సీఎస్‌కే