SRH vs CSK Highlights, IPL 2021: 6 వికెట్ల తేడాతో చెన్నై విజయం.. చివరి ఓవర్‌ వరకు కష్టపడ్డ సీఎస్‌కే

Venkata Chari

|

Updated on: Sep 30, 2021 | 11:20 PM

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్‌కింగ్స్ టీం ముందు 135 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

SRH vs CSK Highlights, IPL 2021: 6 వికెట్ల తేడాతో చెన్నై విజయం.. చివరి ఓవర్‌ వరకు కష్టపడ్డ సీఎస్‌కే
Ipl 2021, Srh Vs Csk

Sunrisers Hyderabad vs Chennai Super Kings Live Score Today IPL 2021 Match: చివరి ఓవర్‌ వరకు సాగిన ఈ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ టీం 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తక్కువ స్కోరే అయినా చివరి ఓవర్‌ వరకు ధోని సేన కష్టపడింది. 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ 45, డుప్లెసిస్ 41 పరుగులతో మంచి ఆరంభాన్ని అందిచారు. వీరిద్దరు ఔటయ్యాక వెంటవెంటనే వికెట్లు కోల్పోయి చివరి ఓవర్‌ వరకు కష్టపడ్డారు. చివరకు ధోని 14, అంబటి రాయుడు 17 పరుగులతో చెన్నై విజయాన్ని ఖాయం చేశారు. అలీ 17, సురేష్ రైనా 2 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. జాన్సన్ హోల్డర్ 3, రషీద్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు.

ఐపీఎల్ 2021 లో, సెప్టెంబర్ 30 న ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపుగా బయటపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్‌కింగ్స్ టీం ముందు 135 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాప్ స్కోరర్‌గా సాహా 44 పరుగులతో (46 బంతులు, 2 సిక్సులు, 1 ఫోర్) నిలిచాడు. ఇక చైన్నై బౌలర్లలో జోష్ హజల్‌వుడ్ 3 వికెట్లు, డ్వేన్ బ్రావో 2, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు. 

ఐపీఎల్ 2021 లో, సెప్టెంబర్ 30 న ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపుగా బయటపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది. రెండు జట్ల ఈ మ్యాచ్ చాలా విషయాలు సరిపోలడం లేదు. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ జట్టు అట్టడుగున ఉండగా, మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని సీఎస్‌కే అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్ తమ చివరి మ్యాచ్‌లో గెలిచినప్పటికీ, విజయ పరంపరను కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తుంది. కేన్ విలియమ్సన్ వరుసగా ఐదు పరాజయాల తర్వాత హైదరాబాద్‌ని విజయపథంలో నడిపించాడు. సన్ రైజర్స్ 10 మ్యాచుల్లో ఎనిమిది ఓడింది. అదే సమయంలో, చెన్నై 10 మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచింది.

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఏకపక్షంగా సాగిన పోటీల్లో చెన్నై వర్సెస్ హైదరాబాద్ టీంలు ముందు వరుసలో ఉంటాయి. లీగ్ చరిత్రలో రెండు జట్ల మధ్య 15 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 11 మ్యాచ్‌లు ధోనీ సేన గెలిచింది. హైదరాబాద్ కేవలం 4 సార్లు మాత్రమే గెలిచింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మ

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI)): రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఎంఎస్ ధోని (కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 30 Sep 2021 11:19 PM (IST)

    చెన్నైదే విజయం

    చివరి ఓవర్‌ వరకు సాగిన ఈ మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ టీం 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తక్కువ స్కోరే అయినా చివరి ఓవర్‌ వరకు ధోని సేన కష్టపడింది.

  • 30 Sep 2021 10:44 PM (IST)

    4వ వికెట్ కోల్పోయిన చెన్నై

    డుప్లిసెస్ (41 పరుగులు, 36 బంతులు, 3 ఫోర్లు, 2 సిక్సులు) రూపంలో చెన్నై టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. హోల్డర్ బౌలింగ్‌లో కౌల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 15.5 ఓవర్లకు టీం స్కోర్ 108/4

  • 30 Sep 2021 10:39 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన చెన్నై

    రైనా (2 పరుగులు) రూపంలో చెన్నై టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. హోల్డర్ బౌలింగ్‌లో రైనా ఎల్బీగా పెవిలియన్ చేరాడు. 15.3 ఓవర్లకు టీం స్కోర్ 107/3

  • 30 Sep 2021 10:33 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన చెన్నై

    మొయిన్ అలీ (17 పరుగులు) రూపంలో చెన్నై టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. 14.4 ఓవర్లకు టీం స్కోర్ 103/2

  • 30 Sep 2021 10:23 PM (IST)

    13 ఓవర్లకు చెన్నై స్కోర్ 97/1

    13 ఓవర్లు ముగిసే సరికి చెన్నై టీం ఒక వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్ 37, అలీ 16 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. విజయానికి 42 బంతుల్లో 38 పరుగులు

  • 30 Sep 2021 10:11 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన చెన్నై

    రుతురాజ్ గైక్వాడ్ (45 పరుగులు, 38 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు) రూపంలో చెన్నై టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. హోల్డర్ బౌలింగ్‌లో విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 10.1 ఓవర్లకు టీం స్కోర్ 75/1

  • 30 Sep 2021 09:55 PM (IST)

    6 ఓవర్లకు చెన్నై స్కోర్ 47/0

    6 ఓవర్లు ముగిసే సరికి చెన్నై టీం 47 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్ 31, డుప్లెసిస్ 15 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. విజయానికి 84 బంతుల్లో 88 పరుగులు

  • 30 Sep 2021 09:39 PM (IST)

    3 ఓవర్లకు చెన్నై స్కోర్ 12/0

    3 ఓవర్లు ముగిసే సరికి చెన్నై టీం 12 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్ 12, డుప్లెసిస్ 1 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 30 Sep 2021 09:31 PM (IST)

    మొదలైన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్

    135 పరుగుల లక్ష్యంతో చెన్నై సూపర్ కింగ్స్ టీం బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్ బరిలోకి దిగారు.

  • 30 Sep 2021 09:12 PM (IST)

    చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ 135

    టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్‌కింగ్స్ టీం ముందు 135 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

  • 30 Sep 2021 09:04 PM (IST)

    7వ వికెట్ కోల్పోయిన హైదరాబాద్

    హోల్డర్ (5) రూపంలో హైదరాబాద్ టీం ఏడో వికెట్‌ను కోల్పోయింది. ఠాకూర్ బౌలింగ్‌లో చాహర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 18.2 ఓవర్లకు టీం స్కోర్ 117/7

  • 30 Sep 2021 08:56 PM (IST)

    ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు

    హజల్ వుడ్ బేసిన 17 వ ఓవర్లో వెంటవెంటనే హైదరాబాద్ టీం రెండు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగింది. అబ్దుల్ 18, అభిషేక్ శర్మ 18 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.

  • 30 Sep 2021 08:42 PM (IST)

    15 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 97/4

    15 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం 4 వికెట్లు నష్టపోయి 97 పరుగులు చేసింది. క్రీజులో అబ్దుల్ 14, అభిషేక్ శర్మ 10 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 30 Sep 2021 08:31 PM (IST)

    4వ వికెట్ కోల్పోయిన హైదరాబాద్

    సాహా (44 పరుగులు, 46 బంతులు, 2 సిక్సులు, 1 ఫోర్) రూపంలో హైదరాబాద్ టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 12.3 ఓవర్లకు టీం స్కోర్ 74/4

  • 30 Sep 2021 08:24 PM (IST)

    3వ వికెట్ కోల్పోయిన హైదరాబాద్

    గార్గ్ (7) రూపంలో హైదరాబాద్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. బ్రావో బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 11 ఓవర్లకు టీం స్కోర్ 67/3

  • 30 Sep 2021 08:15 PM (IST)

    9 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 57/2

    9 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం 2 వికెట్లు నష్టపోయి 57 పరుగులు చేసింది. క్రీజులో సాహా 33, గార్గ్ 4 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 30 Sep 2021 08:05 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్

    విలియమ్సన్ (11) రూపంలో హైదరాబాద్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. బ్రావో బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు.

  • 30 Sep 2021 07:49 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన హైదరాబాద్

    జాన్సన్ రాయ్ (2) రూపంలో హైదరాబాద్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. హజల్ వుడ్ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 30 Sep 2021 07:45 PM (IST)

    3 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 19/0

    మూడు ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో రాయ్ 2, సాహా 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 30 Sep 2021 07:39 PM (IST)

    మొదలైన హైదరాబాద్ బ్యాటింగ్

    టాస్ ఓడిన హైదరాబాద్ టీం బ్యాటింగ్ మొదలు పెట్టింది. ఓపెనర్లుగా సాహా, జాన్సన్ రాయ్‌లు బరిలోకి దిగారు

  • 30 Sep 2021 07:07 PM (IST)

    ప్లేయింగ్ ఎలెవన్

    సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మ

    చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI)): రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఎంఎస్ ధోని (కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

  • 30 Sep 2021 07:03 PM (IST)

    టాస్ గెలిచిన ధోని సేన

    చెన్నై సూపర్ కింగ్స్ టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత హైదరాబాద్ టీం బ్యాటింగ్ చేయనుంది.

  • 30 Sep 2021 06:55 PM (IST)

    SRH vs CSK: గత మ్యాచ్‌లో విజయం ఎవరిదంటే?

    ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన చివరి పోరులో చెన్నై టీం గెలిచింది. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్, డేవిడ్ వార్నర్ (57),  మనీష్ పాండే (61) హాఫ్ సెంచరీల సహాయంతో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన చెన్నై టీం రితురాజ్ గైక్వాడ్ (75), ఫాఫ్ డు ప్లెసిస్ (56) అద్భుత బ్యాటింగ్‌తో 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.

  • 30 Sep 2021 06:51 PM (IST)

    SRH vs CSK: హెడ్‌ టూ హెడ్ రికార్డులు

    ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఏకపక్షంగా సాగిన పోటీల్లో చెన్నై వర్సెస్ హైదరాబాద్ టీంలు ముందు వరుసలో ఉంటాయి. లీగ్ చరిత్రలో రెండు జట్ల మధ్య 15 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 11 మ్యాచ్‌లు ధోనీ సేన గెలిచింది. హైదరాబాద్ కేవలం 4 సార్లు మాత్రమే గెలిచింది.

Published On - Sep 30,2021 6:48 PM

Follow us