AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వార్నీ.. ఈ లేడీ క్రికెటర్లను గుర్తు పట్టారా.. మూడో నంబర్‌తో ప్రేమలో పడిపోతారంతే..

ICC మహిళల U19 ప్రపంచ కప్ రెండవ ఎడిషన్ శనివారం, జనవరి 18, 2025న మలేషియాలో ప్రారంభమైంది. టోర్నీలో 16 జట్లు పాల్గొంటాయి. ఈ ఎడిషన్‌లో ఆతిథ్య మలేషియా, నేపాల్, నైజీరియా, సమోవా తొలిసారి పాల్గొంటున్నాయి. మహిళల ఏజ్ గ్రూప్ టోర్నమెంట్‌లో ఈ టోర్నీ రెండో ఎడిషన్.

Video: వార్నీ.. ఈ లేడీ క్రికెటర్లను గుర్తు పట్టారా.. మూడో నంబర్‌తో ప్రేమలో పడిపోతారంతే..
Team India Players Ai Video
Venkata Chari
|

Updated on: Jan 20, 2025 | 7:10 PM

Share

పురుషుల టోర్నీలా కాకుండా మహిళల అండర్-19 ప్రపంచకప్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. ఇటీవలే అండర్ 19 మహిళల ఆసియా కప్‌ను భారత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. 2023లో జరిగే అండర్-19 ప్రపంచకప్‌ను కూడా భారత జట్టు కైవసం చేసుకుంది. సీనియర్ టీమ్ బ్యాటర్ షఫాలీ వర్మ నాయకత్వంలో ఇంగ్లండ్‌ను ఓడించి దక్షిణాఫ్రికాలో భారత్ తొలి టైటిల్ గెలుచుకుంది. ప్రస్తుత భారత స్టార్లు రిచా ఘోష్, టిటాస్ సాధు కూడా టీమిండియాలో భాగంగా ఉన్నారు.

ఈ క్రమంలో అండర్ 19 భారత ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఓ వీడియో మాత్రం అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది. వీళ్లంతా లేడీ క్రికెటర్లు అనుకుంటే, పప్పులో కాలేసినట్లే. ఇందులో టీమిండియా మెన్స్ టీంలోని పాపులర్ ఫేస్‌లను ఏఐలో మహిళా క్రికెటర్లుగా మార్చి ఓ వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఏఐ టెక్నాలజీతో సచిన్, కోహ్లీ, రోహత్, సంజూ శాంసన్, ధోని, బుమ్రా ఇలా ఎంతోమంది టీమిండియా స్టార్ ప్లేయర్ల ముఖాలను మహిళా క్రికెటర్లకు జోడించి వీడియో వదిలారు. మహిళల రూపంలో దర్శనమిచ్చిన టీమిండియా స్టార్ ప్లేయర్లను చూస్తూ, అభిమానులు మురిపిపోతున్నారు. ముఖ్యంగా వీరందరిలో బుమ్రా ఫేస్ ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను మీరు కూడా చూసి ఆనందించండి.

వైరల్ వీడియో..

View this post on Instagram

A post shared by Sibinyash (@sibinyash_ai)

ICC U19 మహిళల ప్రపంచ కప్ ఫార్మాట్..

ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచకప్ తొలి దశ రౌండ్ రాబిన్ లీగ్ ఆధారంగా జరగనుంది. ఇందుకోసం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి మొదటి మూడు జట్లు సూపర్ 6 దశకు అర్హత సాధిస్తాయి, ఇక్కడ ఒక్కొక్కటి 6 జట్లతో కూడిన రెండు పూల్స్‌గా విభజించారు. అర్హత సాధించిన జట్లు మొదటి రౌండ్‌లో ఎదుర్కోని ప్రతి ఇతర జట్టుతో ఈ దశలో ఆడతాయి. ఒక్కో పూల్ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు జనవరి 31న జరిగే సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఫైనల్‌ ఫిబ్రవరి 2న పండమరన్‌లోని బయోమాస్‌ ఓవల్‌లో జరుగుతుంది.

గ్రూప్ A: భారత్, మలేషియా, శ్రీలంక, వెస్టిండీస్

గ్రూప్ B: ఇంగ్లండ్, ఐర్లాండ్, పాకిస్థాన్, USA

గ్రూప్ సి: న్యూజిలాండ్, నైజీరియా, సమోవా, దక్షిణాఫ్రికా

గ్రూప్ డి: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నేపాల్, స్కాట్లాండ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..