Best Bowling in ODIs: వన్డేల్లో తోపు బౌలర్లు వీరే.. లిస్టులో భారత్ నుంచి ముగ్గురు.. మహ్మద్ సిరాజ్ ప్లేస్ ఎక్కడంటే?
Best Bowling in ODI Format:వన్డే క్రికెట్ చరిత్రలో ఇది అత్యుత్తమ బౌలింగ్ స్పెల్ మహ్మద్ సిరాజ్‌ది కాదు. ఎందుకంటే ఇంతకు ముందు వన్డే క్రికెట్‌లో 29 మంది బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. తాజాగా ఈ లిస్టులో టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ చేరాడు. సిరాజ్ కంటే ముందు భారత్ నుంచి ఇద్దరు బౌలర్లు ఈ లిస్టులో ఉన్నారు. ఆ బౌలర్లు ఎవరు, వారు ఏ జట్టుపై ఎన్ని వికెట్లు తీశారు అనే పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం..

Siraj
మహ్మద్ సిరాజ్ ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై తుఫాన్ బౌలింగ్ దాడితో 21 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. దీని ద్వారా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ, వన్డే క్రికెట్ చరిత్రలో ఇది అత్యుత్తమ బౌలింగ్ స్పెల్ కాదు. ఎందుకంటే ఇంతకు ముందు వన్డే క్రికెట్‌లో 29 మంది బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు.
ఆ బౌలర్లు ఎవరు, వారు ఏ జట్టుపై ఎన్ని వికెట్లు తీశారు అనే పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం..
ODI క్రికెట్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు:
- చమిందా వాస్ (శ్రీలంక) – 8/19 vs జింబాబ్వే, 2001
- షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్) – 7/12 vs వెస్టిండీస్, 2013
- గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) – 7/15 vs నమీబియా, 2003
- రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్) – 7/18 vs వెస్టిండీస్, 2017
- ఆండీ బికెల్ (ఆస్ట్రేలియా) – 7/20 vs ఇంగ్లాండ్, 2003
- ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) – 7/30 vs భారతదేశం, 2000
- అలీ ఖాన్ (USA) – 7/32 vs జెర్సీ, 2013
- టిమ్ సౌతీ (న్యూజిలాండ్) – 7/33 vs ఇంగ్లాండ్, 2015
- ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్) – 7/34 vs వెస్టిండీస్, 2017
- వాకర్ యూనిస్ (పాకిస్తాన్) – 7/36 vs ఇంగ్లాండ్, 2001
- అకిబ్ జావేద్ (పాకిస్తాన్) – 7/37 vs భారతదేశం, 1991
- ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా) – 7/45 vs వెస్టిండీస్, 2016
- విన్‌స్టన్ డేవిస్ (వెస్టిండీస్) – 7/51 vs ఆస్ట్రేలియా, 1983
- స్టువర్ట్ బిన్నీ (భారతదేశం) – 6/4 vs బంగ్లాదేశ్, 2014
- సందీప్ లామిచానే (నేపాల్) – 6/11 vs పాపువా న్యూ గినియా, 2021
- అనిల్ కుంబ్లే (భారతదేశం) – 6/12 vs వెస్టిండీస్, 1993
- అజంతా మెండిస్ (శ్రీలంక) – 6/13 vs భారతదేశం, 2008
- గ్యారీ గిల్మర్ (ఆస్ట్రేలియా) – 6/14 vs ఇంగ్లాండ్, 1975
- ఇమ్రాన్ ఖాన్ (పాకిస్తాన్) – 6/14 vs భారతదేశం, 1985
- ఫర్వీజ్ మహ్రూఫ్ (శ్రీలంక) – 6/14 vs వెస్టిండీస్, 2006
- కోలిన్ క్రాఫ్ట్ (వెస్టిండీస్) – 6/15 vs ఇంగ్లాండ్, 1981
- షోయబ్ అక్తర్ (పాకిస్తాన్) – 6/16 vs న్యూజిలాండ్ 2002
- కగిసో రబడ (దక్షిణాఫ్రికా) – 6/16 vs బంగ్లాదేశ్, 2015
- సందీప్ లామిచానే (నేపాల్) – 6/16 vs USA, 2020
- అజర్ మహమూద్ (పాకిస్తాన్) – 6/18 vs వెస్టిండీస్, 1999
- హెన్రీ ఒలోంగా (జింబాబ్వే)- 6/19 vs ఇంగ్లాండ్, 2000
- షేన్ బాండ్ (న్యూజిలాండ్) – 6/19 vs భారతదేశం, 2005
- జస్ప్రీత్ బుమ్రా (భారతదేశం) – 6/19 vs ఇంగ్లాండ్, 2022
- బ్రియాన్ స్ట్రాంగ్ (జింబాబ్వే) – 6/20 vs బంగ్లాదేశ్, 1997
- ఏంజెలో మాథ్యూస్ (శ్రీలంక) – 6/20 vs భారతదేశం, 2009
- మహ్మద్ సిరాజ్ (భారతదేశం) – 6/21 vs శ్రీలంక, 2023
నేపాల్ జట్టు స్పిన్నర్ సందీప్ లామిచానే వన్డే క్రికెట్‌లో 2 అత్యల్ప పరుగులతో 6 వికెట్లు పడగొట్టాడు. ఈ లిస్టులో సిరాజ్ కంటే ముందు 29 మంది బౌలర్లు అద్భుత బౌలింగ్ ప్రదర్శించారని పేర్కొన్నారు.
