AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఈ కరాటే కిడ్‌ను గుర్తు పట్టారా? టీమిండియా స్టైలిష్ బ్యాటర్.. ట్యాలెంట్ ఉన్నా జట్టుకు దూరంగానే..

ఈ బుడ్డోడు ఇప్పుడు టీమిండియా క్రికెటర్ అయిపోయాడు. స్టైలిష్ బ్యాటర్ గా అందరి మన్ననలు అందుకున్నాడు. తన సొగసరి బ్యాటింగ్ తో భారత జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించిన ఈ ప్లేయర్ కెప్టెన్ గానూ రాణించాడు. ఆసీస్ లాంటి అగ్రశేణి జట్లను దడదడలాడించాడు.

Team India: ఈ కరాటే కిడ్‌ను గుర్తు పట్టారా? టీమిండియా స్టైలిష్ బ్యాటర్.. ట్యాలెంట్ ఉన్నా జట్టుకు దూరంగానే..
Team India Cricketer Childhood Photo
Basha Shek
|

Updated on: Jul 11, 2024 | 8:46 AM

Share

పై ఫొటోలో కరాటే ఫైటర్ లా పోజులిస్తోన్న ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? ఈ బుడ్డోడు ఇప్పుడు టీమిండియా క్రికెటర్ అయిపోయాడు. స్టైలిష్ బ్యాటర్ గా అందరి మన్ననలు అందుకున్నాడు. తన సొగసరి బ్యాటింగ్ తో భారత జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించిన ఈ ప్లేయర్ కెప్టెన్ గానూ రాణించాడు. ఆసీస్ లాంటి అగ్రశేణి జట్లను దడదడలాడించాడు. అయితే ట్యాలెంట్ ఉన్నా ఇప్పుడు అదృష్టం కలిసి రావట్లేదు ఈ ప్లేయర్ కు. దీనికి తోడు యువకుల ఎంట్రీతో జట్టులో చోటు కోల్పోయాడు. అయినా టీమిండియాలో ప్లేస్ కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అందుకే రంజీల్లో ఆడుతూ తన ఆటను మరింతగా మెరుగుపర్చుకుంటున్నాడు. అలాగే ఐపీఎల్ లోనూ ధనాధన్ బ్యాటింగ్ తో అభిమానులను అలరిస్తున్నాడు. మరి ఈ ఫొటోలోని పిల్లాడిని గెస్ చేశారా? కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుదాం లెండి. ఇతను మరెవరో కాదు.. టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానే. ఇది అతని చిన్ననాటి ఫొటో.

ఇవి కూడా చదవండి

అజింక్యా రహానే ఇప్పటివరకు టీమిండియా తరఫున 85 టెస్టులు ఆడాడు. మొత్తం 5,077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక కెప్టెన్ గానూ అదరగొట్టాడు అజింక్యా. ముఖ్యంగా కోహ్లీ గైర్జాజరీలో జట్టు పగ్గాలు స్వీకరించి ఆస్ట్రేలియాను వారి గడ్డమీదే చిత్తు చేశాడు. ఇక వన్డేల విషయానికి వస్తే.. మొత్తం 90 వన్డేలు ఆడాడు. అలాగే 20 అంతర్జాతీయ టీ20లు కూడా ఆడాడు.

ఇక అజింక్యా రహేనే చివరిగా 2023 జూలైలో వెస్టిండీస్‍తో టెస్టు ఆడాడు. ఆ తర్వాత పేలవమైన ఆటతీరుతో టీమ్‍లో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం రహానే బాగానే ఆడుతున్నాడు. కానీ సెలెక్టర్లు మాత్రం యువకులకే జట్టులో ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే రహానేకు మళ్లీ అవకాశం రావడం లేదు. ఇక ఐపీఎల్‍లో ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు రహానే.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..